కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

  • Published By: madhu ,Published On : September 29, 2019 / 03:58 AM IST
కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

టాలీవుడ్ సినీ రచయితీ, దర్శకుడు కోన వెంకట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జెమిని ఎఫ్‌ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ కంప్లయింట్ మేరకు చీటింగ్ కింద..జూబ్లిహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. IPC 406, IPC 420 సెక్షన్ల కింద కేసును రిజిష్టర్ చేశారు. సినిమాకు కథ ఇస్తానని చెప్పి నగదు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో ప్రసాద్ తెలిపారు. 2017 సంవత్సరంలో రూ. 13.50 లక్షలు తీసుకున్నారని..డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని ప్రసాద్ ఆరోపించినట్లు తెలుస్తోంది. 

హీరోతో డ్రామా పండించి..హీరోయిన్‌ను దెయ్యంగా చూపించి..విలన్‌తో కామెడీ పండించి..ఢీ, రెడీలతో తెలుగు సినిమా దూకుడు పెంచిన కథా రచయిత, నిర్మాత, దర్శకుడు, పాటల రచయిత ఈయన. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చి..సినీ పరిశ్రమలోకి వచ్చి రెండున్నర దశాబ్దాలుగా రాణిస్తున్నారు. రాజకీయ అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తుంటారు.

Read More : దసరా సెలవులు : అప్పుడే బస్సులు కిటకిట
ఎల్వీ ప్రసాద్ ద్రోహి సినిమాలో విలన్‌గా యాక్టింగ్ చేశారు. ఇటీవలే అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో యువతి మరణించడంపై ఆయన స్పందించారు. ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 20 వద్ద ఉన్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రమాదకరంగా పెచ్చులు ఊడిపోయిన ఫ్లై ఓవర్ ఫొటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్టు చేశారు. తాజాగా కేసుకు సంబంధించిన విషయంలో కోన వెంకట్ ఎలా స్పందిస్తారో చూడాలి.