కేసిఆర్ కేరళ టూర్: ఫెడరల్ ఫ్రంట్‌పై కీలక చర్చలు

  • Published By: vamsi ,Published On : May 6, 2019 / 02:24 AM IST
కేసిఆర్ కేరళ టూర్: ఫెడరల్ ఫ్రంట్‌పై కీలక చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో చర్యలను ముమ్మరం చశారు. దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఇవాళ(06 మే 2019) కేరళకు వెళ్లబోతున్నారు కేసిఆర్.  త్రివేండ్రంలో సాయంత్రం 6గంటలకు  కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.

నాలుగు విడతల లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన క్రమంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు ఉన్న సాధ్యాలను విజయన్‌కు వివరించనున్నారు. కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కూడా కేసిఆర్ కుటుంబంతో కలిసి దర్శించుకోనున్నారు.

కేరళ పర్యటన అనంతరం ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కేసీఆర్ మళ్లీ పర్యటించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే కేసిఆర్ ఓసారి ఢిల్లీ టూర్ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ రాదని చెబుతున్న కేసీఆర్.. కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

గతేడాది బెంగాల్ సీఎం మమతా, యూపీ మాజీ సీఎం మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడలతో కేసిఆర్ భేటీ అయ్యారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటుండటంతో కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ టూర్ చేస్తున్నారు.