హ్యాట్సాప్ పిల్లలు : నుమాయిష్ ను క్లీన్ చేశారు.. ఫుడ్ అందించారు

హ్యాట్సాప్ పిల్లలు : నుమాయిష్ ను క్లీన్ చేశారు.. ఫుడ్ అందించారు

రెండ్రోజుల క్రితం జరిగిన నుమాయిష్ అగ్ని ప్రమాదం ఘటనలో 300పైగా స్టాళ్లు ఘోరంగా నష్టపోయాయి. ఎగ్జిబిషన్‌లో భాగంగా వ్యాపారస్థులు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులతో విక్రయానికి సిద్ధమైన తరుణంలో జరిగిన ప్రమాదం దుకాణదారులను కుదిపేసింది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన 2500 స్టాళ్లలో 300 స్టాళ్లకు  పైగా భారీ నష్టానికి గురైయ్యాయి.

ప్రమాదనంతరం స్పందించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారు. అనంతరం వ్యర్థాలను క్రేన్‌ల ద్వారా తొలిగించే యత్నం చేస్తున్నారు. చాలా వరకూ షాపులలో ఇనుప రాడ్లు బయటికి వచ్చేసి సంచరించేందుకు ప్రతికూలంగా తయారయ్యాయి. పరిసరాలను శుభ్రపరిచేందుకు చాలా సమయం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.

తమవంతు బాధ్యతగా విద్యార్థులు:
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్ సొసైటీ(టీఎమ్మార్ఈఐఎస్) విద్యార్తులు కదిలొచ్చారు. వ్యర్థాలను శుభ్రం చేసుకుంటున్న యజమానుదారులకు సాయం అందించడమే కాకుండా ఆహార పదార్థాలను సమకూరుస్తున్నారు. 250 మందికి గుడ్డు, వెజ్ బిర్యానీ వంటి ఆహార పదార్థాలను అందించి కష్టకాలంలో మీకు అండగా మేము ఉన్నామంటూ ఆసరాగా నిలిచారు.

 

గడువు పొడిగింపు:
ముందుగా నుమైశ్ ఎగ్జిబిషన్‌ను ఫిబ్రవరి 15వరకూ ఏర్పాటు చేయాలని భావించినా ప్రమాదం కారణంగా దానిని ఫిబ్రవరి 28వరకూ పొడిగించారు. నష్టపోయిన వాటిలో దాదాపు కశ్మీర్ నుంచి దిగుమతి చేసుకున్న డ్రై ఫ్రూట్స్, వస్త్ర దుకాణాలే ఉన్నాయని దుకాణదారులు పేర్కొన్నారు.