ప్రధానితో సీఎం భేటీ సమయంలో మార్పు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ప్రధానితో కేసీఆర్ భేటీ సమయం మారిపోయింది. శుక్రవారం(అక్టోబర్ 04,2019) ఉదయం 11గంటలకు

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 03:40 AM IST
ప్రధానితో సీఎం భేటీ సమయంలో మార్పు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ప్రధానితో కేసీఆర్ భేటీ సమయం మారిపోయింది. శుక్రవారం(అక్టోబర్ 04,2019) ఉదయం 11గంటలకు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ప్రధానితో కేసీఆర్ భేటీ సమయం మారిపోయింది. శుక్రవారం(అక్టోబర్ 04,2019) ఉదయం 11గంటలకు బదులు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడమే లక్ష్యంగా హస్తిన బాట పట్టిన కేసీఆర్‌.. ఈ సమావేశంలో… రాష్ట్రానికి ఆర్ధిక సహకారం, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతోపాటు విభజన అంశాలపై చర్చించనున్నారు. జాతీయ రహదారులు, రీజినల్ రింగ్‌ రోడ్డు నిర్మాణం, కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించనున్నారు. 

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన రూ.19వేల కోట్ల సాయాన్ని మంజూరు చేయాలని కూడా ప్రధానిని కోరనున్నారు కేసీఆర్. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని, కేంద్ర పథకాలకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని ఈ సమావేశంలో ప్రధానిని కోరనున్నారు సీఎం కేసీఆర్. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసినందున.. జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాలని కోరే అవకాశం ఉంది.

ప్రధానితో భేటీ తర్వాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌ను కూడా కలుసుకోనున్నారు కేసీఆర్. పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అంటే 10 నెలల తర్వాత కేసీఆర్ తొలిసారి కలుస్తుండటంతో ఈ భేటీ పొలిటికల్‌గా చర్చనీయాంశమైంది. మరోవైపు… శనివారం(అక్టోబర్ 05,2019 కూడా కేసీఆర్‌ ఢిల్లీలోనే ఉంటారు.