హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 07:57 AM IST
హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకుంటోందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చలో.. కేంద్ర ప్రభుత్వం తీరుపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు సహకారమే లేదని సీఎం కేసీఆర్ వాపోయారు. మార్పులకు అనుగుణంగా పాలకులు మారాలని సూచించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరం అని స్పష్టం చేశారు.
Read Also: ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమే : కేటీఆర్ జోస్యం

కేసీఆర్ నోట చైనా మాట వినిపించింది. చైనా జీఎస్‌డీపీ కంటే మన జీఎస్‌డీపీ చాలా ఎక్కువ అని కేసీఆర్ అన్నారు. అయినా మనం అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం పాలకులే అని కేసీఆర్ అన్నారు. అప్పులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. అప్పులు తెచ్చినా చెల్లించే స్థోమత తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ రాష్ట్రం వెళ్లలేదని, ఎఫ్ఆర్‌బీఎం పరిధిని తెలంగాణ ఎక్కడా దాటలేదని కేసీఆర్ చెప్పారు.

Read Also: బాలకృష్ణ తప్పు అదేనట.. వర్మ పెట్టిన సంచలన వీడియో!
Read Also: నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారు