మందుబాబులకు మరో షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్న మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం ప్రియులకు సీఎం కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. లాక్

  • Published By: veegamteam ,Published On : April 12, 2020 / 03:19 AM IST
మందుబాబులకు మరో షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్న మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం ప్రియులకు సీఎం కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. లాక్

తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్న మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం ప్రియులకు సీఎం కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. లాక్ డౌన్ ఎత్తివేసేవరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. అప్పటివరకు మద్యం షాపులు మూసే ఉంటాయన్నారు. అంటే మందుబాబులు మరో రెండు వారాలు (ఏప్రిల్ 30) తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఏప్రిల్ నెల ఓపిక పడితే హాయిగా ఉండొచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. లేదంటే దేశానికే ప్రమాదం అన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం అందరూ సహకరించాలని సీఎం కోరారు. 

షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీతో లాక్ డౌన్ ముగియాల్సి ఉంది. అయితే ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. లాక్ డౌన్ పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కేంద్రం ప్రకటన రాకముందే కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని శనివారం(ఏప్రిల్ 11,2020) ప్రకటించారు. కరోనా కట్టడికి మరో మార్గం లేదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఏప్రిల్ 30 తర్వాత కరోనా కేసులు లేకపోతే దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.

లాక్ డౌన్ కారణంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఆపేసిన సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా లిక్కర్ షాపులు మూతబడ్డాయి. దీంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్యం దొరక్క పిచ్చోళ్లు అవుతున్నారు. కొందరు మతిస్థిమితం కోల్పోయి ఎర్రగడ్డలో చేరారు. కొంతమంది ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మద్యం లేకపోతే తట్టుకోలేని పేషంట్స్ కోసం ఆన్ లైన్ మద్యం అమ్మకాలను ప్రభుత్వాలు అమలు చేశాయి. తెలంగాణాలోనూ ఏప్రిల్ 15 నుండి మద్యం అమ్మకాలు మొదలవుతాయని వార్తలు షికారు చేశాయి. మందుబాబులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఏప్రిల్ 30వరకు మద్యం షాపులు తెరిచే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పి వారికి మళ్ళీ నిరాశే మిగిల్చారు.