స్ట్రెస్ రిలీఫ్ కోసం : పోలీసులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 05:54 AM IST
స్ట్రెస్ రిలీఫ్ కోసం : పోలీసులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

సీఎం కేసీఆర్ పోలీసులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే వీక్లీ ఆఫ్ ఇస్తామని చెప్పారు. వీక్లీ ఆఫ్ లేదా 10 రోజులకు ఆఫ్.. ఏది ఇవ్వాలి అనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గురువారం(సెప్టెంబర్ 19,2019) సీఎం కేసీఆర్ మాట్లాడారు. పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. పోలీస్ డ్యూటీ అంటే ఎంతో స్ట్రెస్ ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. స్ట్రెస్ రిలీఫ్ కోసం పోలీసు సోదరులకు కూడా ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

”పోలీసులు మన సోదరులు. మన కోసం పని చేస్తున్నారు. వారు లేకపోతే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. వారు ఆరోగ్యంగా ఉంటేనే అంతా ప్రశాంతంగా ఉంటారు. హైదరాబాద్ సిటీకి 6 వైపులా హెలిప్యాడ్ తో కూడిన పోలీస్ కేంద్రాల అవసరం ఉంది. గణేష్ నిమజ్జనం లాంటి ముఖ్యమైన, భారీ కార్యక్రమాన్ని ఎంతో శాంతియుతంగా గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్నారు. పోలీసు యంత్రాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి చేసిన వాళ్లని కాంప్లిమెంట్ చేయాల్సిందే. పోలీసు మిత్రులకు కూడా వీక్లీ ఆఫ్ అని కచ్చితంగా నేను చెప్పలేను కానీ ఏదో ఒకటి చెయ్యమని డీజీపీని రిక్వెస్ట్ చేశాను. ఉన్నతాధికారులు దానిపై స్టడీ చేస్తున్నారు. పోలీసులకు కచ్చితంగా స్ట్రెస్ రిలీఫ్ అవసరం. పోలీస్ డ్యూటీ 8 గంటలు అని చెబతారు.. కానీ గంటలు లేకుండా పని చేస్తారు. వారి పుణ్యమా అని మనమంతా సేఫ్ గా ఉన్నాము. పోలీస్, పవర్, జనరేటింగ్ స్టేషన్లలో సిబ్బంది పగలు, రాత్రి మేల్కొని పని చేస్తారు. పోలీసులు అలర్ట్ గా లేకపోతే సమాజానికి చాలా ఇబ్బందులు వస్తాయి. వీక్లీ ఆఫ్ లేదా 10 రోజులకు ఆఫ్ అనే దానిపై స్టడీ చేస్తున్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం” అని సీఎం కేసీఆర్ అన్నారు.

కాగా, ఏపీలో ఇప్పటికే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే పోలీసులు వీక్లీ ఆఫ్ ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మాటను నిలుపుకున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తున్నారు.