ఆర్టీసీ కొత్త పాలసీ : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

తెలంగాణ ఆర్టీసీ.. సమూల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ నూతన పాలసీ సహా

  • Published By: veegamteam ,Published On : October 7, 2019 / 02:05 PM IST
ఆర్టీసీ కొత్త పాలసీ : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

తెలంగాణ ఆర్టీసీ.. సమూల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ నూతన పాలసీ సహా

తెలంగాణ ఆర్టీసీ.. సమూల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం(అక్టోబర్ 7,2019) సాయంత్రం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ నూతన పాలసీ సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.

సర్కార్‌ ఆదేశాలతో సునీల్‌ శర్మ ఆధ్వర్యంలోని కమిటీ… కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్టీసీలో 50శాతం అద్దె బస్సులను తీసుకోవాలని ప్రతిపాదించింది. ప్రైవేటు బస్సులకు స్టేజ్‌ క్యారేజ్‌ పర్మిట్లు ఇవ్వాలని యోచిస్తోంది. కార్గో, గూడ్స్‌ సర్వీసుల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చాలని భావిస్తోంది. మెట్రో రైల్‌ తరహాలో ఇతర మార్గాల్లో ఆదాయం రాబట్టాలని ప్రతిపాదించింది. సునీల్‌ శర్మ కమిటీ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారు.

ఆర్టీసీ ప్రక్షాళన:
* ఆర్టీసీలో సమూల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు
* ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష
* ఆర్టీసీ నూతన పాలసీ సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చ
* కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
* కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసిన సునీల్‌శర్మ కమిటీ
* ఆర్టీసీలో 50 శాతం అద్దె బస్సులను తీసుకోవడం
* ప్రైవేటు బస్సులకు స్టేజ్‌ క్యారేజ్‌ పర్మిట్లు ఇవ్వడం
* ప్రైవేట్ బస్సుల రూట్ లు, చార్జీలను నిర్ణయించనున్న ఆర్టీసీ
* కార్గో, గూడ్స్‌ సర్వీసుల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చాలని నిర్ణయం
* మెట్రో రైల్‌ తరహాలో ఇతర మార్గాల్లో ఆదాయాన్ని రాబట్టే యోచన
* ఆర్టీసీ భూములను ఆదాయ మార్గాలుగా మార్చుకోవడం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో కార్మికులు సమ్మెకి దిగారు. అక్టోబర్ 5 నుంచి సమ్మె బాట పట్టారు. ఆర్టీసీ సమ్మె మూడో రోజూ కొనసాగింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే వరక సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని తేల్చి చెప్పారు. విధుల్లో చేరని ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించారు. ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టారు.