హైదరాబాద్ లో భూములు అమ్మేస్తా

పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఖర్చయినా వెనకాడకుండా పాలమూరు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ లో భూములు

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 12:16 PM IST
హైదరాబాద్ లో భూములు అమ్మేస్తా

పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఖర్చయినా వెనకాడకుండా పాలమూరు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ లో భూములు

పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఖర్చయినా వెనకాడకుండా పాలమూరు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ లో భూములు అమ్మి మరీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు స్వరూపమే మారిపోతుందన్నారు. జిల్లాలో 15 నుంచి 18 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. పాలమూరు జిల్లాలను పాలుగారే జిల్లాగా మారుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఏదుల ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.

ఏడాదిలోపు పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను నీటితో నింపడానికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు మంచి ఫలితాలు రానున్నాయని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో అసమర్థ పాలకుల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరును వలసల జిల్లాగా మారేందుకు కారణమైన వారే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. పాలమూరు ప్రజలు మమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు.

ఆషామాషీగా తమాషాగా తాను మాటలు చెప్పడం లేదన్న కేసీఆర్.. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా రైతులకు నీళ్లిస్తామన్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానం గొప్ప నిర్ణయమన్న కేసీఆర్‌.. తెలుగు రాష్ట్రాలకు మేలు జరగనుందన్నారు. దీనిపై ఏపీ సీఎం జగన్ తో చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో ఓ నిర్ణయానికి వస్తామన్నారు.