3వేల రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణలోని 3 నుంచి 4వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే మంత్రి మండలి

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 04:03 AM IST
3వేల రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణలోని 3 నుంచి 4వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే మంత్రి మండలి

తెలంగాణలోని 3 నుంచి 4వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే మంత్రి మండలి సమావేశమై దీనికి ఆమోదముద్ర వేసే అవకాశముంది. సమ్మెపై ప్రస్తుతం హైకోర్టులో ఉన్న కేసు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

కేంద్రం తీసుకొచ్చిన మోటార్‌ వెహికల్‌-2019 ప్రకారం ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లభించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని మూడు నుంచి నాలుగువేల  రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తే ఆరోగ్యకర పోటీ ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు దోహదపడతుందని భావిస్తోంది.

పర్మిట్లు ఇస్తే నడపడానికి ప్రైవేటు వాహనాల యజమానులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ఏకంగా 21వేల 453 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని వారే కాకుండా.. ఇతర రాష్ట్రాల వారు సైతం ముందుకొచ్చి బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కార్మిక సంఘాల బెదిరింపుల నుంచి విముక్తి కలగాలంటే పర్మిట్లు ఇవ్వడమే మంచిదని నిర్ణయించినట్లు తెలిసింది.