పచ్చి అబద్దాలు: అసెంబ్లీలో శ్రీధర్ బాబుపై కేసీఆర్ ఆగ్రహం

అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 07:01 AM IST
పచ్చి అబద్దాలు: అసెంబ్లీలో శ్రీధర్ బాబుపై కేసీఆర్ ఆగ్రహం

అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా

అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా బదులిచ్చారు. బడ్జెట్‌లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదని, కాంగ్రెస్‌ వల్లే 24 గంటల కరెంట్‌ సాధ్యమైందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో అరాచకం సృష్టిస్తోందని శ్రీధర్ బాబు అన్నారు. దీనికి కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు.

శ్రీధర్‌బాబు సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదనడం అవాస్తవమన్నారు. గ్రామపంచాయతీలకు రూ.40వేల కోట్లు కేటాయించామని తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ హయాంలో కొనసాగిన ఆరాచకాన్ని భవిష్యత్‌లో కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. అద్దాల్లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తామన్నారు.
Read Also: నెంబర్ బ్లాక్ చేశారా : KTR, ఉత్తమ్ మధ్య సరదా సంభాషణ
 

మహదేవ్‌పూర్‌, కాటారం, పెద్దంపేట్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో 24గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలను కేసీఆర్ ఖండించారు. ఆ సబ్ స్టేషన్ల పరిధిలో 20 రోజుల రికార్డులు పరిశీలిస్తే 24 గంటల కరెంట్‌ సరఫరా అవుతోందని తేలిందన్నారు. అధికారులను సంప్రదించి, రికార్డులను చూసిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య వల్ల గంటో, అరగంటనో కరెంట్‌ పోవడం సహజం అని… అది సీఎం ఇంట్లో కూడా జరుగుతుందని అన్నారు. అసత్యాలు చెప్పడం మంచిది కాదని శ్రీధర్‌బాబుకు కేసీఆర్‌ చురకలంటించారు.

పంచాయతీరాజ్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీలను పటిష్టం చేసేందుకే.. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. బడ్జెట్‌‌లో పంచాయతీలకు నిధులు కేటాయించలేదంటూ ప్రతిపక్ష సభ్యులు అవాస్తవాలు మాట్లాడడం సరికాదన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్న సీఎం.. కాంగ్రెస్ హయాంలో అసలు సోలార్‌ విద్యుత్‌ ప్రారంభం కాలేదన్నారు.
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు
Read Also: గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్