సంచలన నిర్ణయం : ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఔట్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సంఖ్యాపరంగా

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 09:47 AM IST
సంచలన నిర్ణయం : ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఔట్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సంఖ్యాపరంగా

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సంఖ్యాపరంగా టీఆర్ఎస్, ఎంఐఎంలకు 4 ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయి.. కానీ, ప్రజాతీర్పుకి  వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను బరిలోకి దింపిందని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నామని ఉత్తమ్ చెప్పారు.

రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారి ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను గౌరవించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిందని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ మాత్రం సంప్రదాయాలను కాలరాశారని, వికృత రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఉత్తమ్ సీరియస్ అయ్యారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 5 స్థానాల‌కు 6మంది పోటీ ప‌డుతున్నారు. టీఆర్‌ఎస్ దాని మిత్రపక్షం ఎంఐఎం నుంచి ఐదుగురు.. కాంగ్రెస్ నుంచి ఒక‌రు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. పార్టీల బలాబలాలను పరిశీలిస్తే ఒక‌రు ఓట‌మి పాలు కాక త‌ప్ప‌దు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఓడిపోయే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

టీఆర్ఎస్ తరపున ఎగ్గే మల్లేశం, శేరి శుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ నామినేష‌న్ దాఖలు చేయగా… ఎంఐఎం నుంచి ఒకరు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గూడూరు నారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కచ్చితంగా 5 సీట్లు గెలిచి తీరుతామ‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. కాంగ్రెస్ మాత్రం త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకుంటూనే టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై ఆశ‌లు పెట్టుకుంది.

ఎమ్మెల్సీగా గెల‌వాలంటే 21మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. స‌భ‌లో టీఆర్ఎస్‌కు 90మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యేలు 7గురితో కలిపి టీఆర్ఎస్ బలం 98కు చేరుతుంది. ఒక్కొక్క అభ్య‌ర్థికి 21 ఓట్లు చొప్పున ఐదుగురికి క‌లిపి మొత్తం 105 ఓట్లు టీఆర్ఎస్‌కు అవ‌స‌ర‌మ‌వుతాయి. టీఆర్ఎస్‌కు 5 ఓట్లు తక్కువ ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ అభ్య‌ర్థికే ఓటు వేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాంగ్రెస్‌కు సొంతంగా 19మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 16కి పడిపోయింది. టీడీపీ నుంచి గెలిచిన మెచ్చ నాగేశ్వ‌ర రావు త‌మ‌కే ఓటు వేస్తార‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్రాధాన్యత ఓటింగ్ విధానం ఉంటుంది కాబ‌ట్టి రెండో ప్రాధాన్యత ఓటు కూడా కీలకం కాబోతుంది. బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండే అవ‌కాశాలున్నాయి.