కాంగ్రెస్ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి : దామోదర

  • Edited By: veegamteam , January 6, 2019 / 11:20 AM IST
కాంగ్రెస్ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి : దామోదర

హైదరాబాద్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పై నిరసన గళం వినిపిస్తున్నారు. పార్టీ విధానాలపై, అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కొక్కరుగా పార్టీపై నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనరసింహ సూచించారు. ’ఓటర్ ఆలోచన మారింది…దానికి అనుగుణంగా మారాలి’ అని అన్నారు.

ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలిపారు. అధికార దుర్వినియోగం, ఈసీ పనితీరుపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈసీ నిర్ణయాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని విమర్శించారు. మల్లన్నసాగర్ తప్పితే ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేయలేకపోయిందన్నారు. ఆ 20 రోజులు ఏం చేశామన్నదే ముఖ్యమైందని చెప్పారు.