Komuram Bheem : అడవిదున్నకు కొమురం భీమ్ పేరు..వెల్లువెత్తిన విమర్శలు

కొమురం భీమ్ పేరును ఓ అడవి దున్నకు పెట్టటం వివాదంగా మారింది. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో ఓ అడవిదున్న కు ఆదివాసీ నేత..గోండుల బెబ్బులిగా పేరొందిన కొమురం భీమ్ పెట్టడంతో వివాదాస్పదంగా మారింది.

Komuram Bheem : అడవిదున్నకు కొమురం భీమ్ పేరు..వెల్లువెత్తిన విమర్శలు

Komuram Bheem

Komuram Bheem naming Zoo Park Adavi dunna : కొమురం భీమ్. గోండుల బెబ్బులి కొమురం భీమ్. ఆదివాసీలకు ఆద్యుడు. అటువంటి కొమురం భీమ్ పేరును ఓ అడవి దున్నకు పెట్టటం వివాదంగా మారింది. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో ఓ అడవిదున్న కు ఆదివాసీ నేత..గోండుల బెబ్బులిగా పేరొందిన కొమురం భీమ్ పెట్టడంతో వివాదాస్పదంగా మారింది. దీన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించటంతో జూ సిబ్బంది వెనక్కి తగ్గారు. అనంతరం అడవిదున్నకు పెట్టిన కొమురం భీమ్ పేరును తొలగిస్తున్నామని జూపార్క్ క్యూరేటర్ ఆర్.శోభ ప్రకటించటంతో వివాదానికి తెరపడింది.

కాగా..నగరంలోని జూ పార్క్ లోని అడవిదున్న ఒక బిడ్డ కు జన్మనిచ్చింది. ఆ లేగ దున్నకు జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల ఆద్యుడు కొమురం భీమ్ అని పేరు పెట్టారు.దీంతో ఓ అడవిదున్నకు ఆదివాసి నేత పేరు పెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో జూ సిబ్బంది పేరును తొలగించినట్లుగా ప్రకటించటంతో వివాదం సద్దుమణిగింది.

కొమురం భీమ్ అక్టోబర్ 22, 1901లో ఆదివాసీల కుటుంబంలో జన్మించారు. నిజాం దొరల పాలనలో అణగారిన వర్గాలు హింసలు అనుభవించేవారు. హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ పోరాడాడు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు.

నూనూగు మీసాల 15 ఏళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో భీమ్ తండ్రి మరణించారు. దీంతో కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకుని..నిజాం అధికారాలను ఏమాత్రం ఖాతరు చేసేవాడు కాదు. తీవ్రంగా వ్యతరేకించేవాడు.నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాడేవాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఆ ఉద్యమంలో వీరమరణం పొందాడు.

భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన వీరుడు కొమురం భీమ్. ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయాడు కొమురం భీమ్. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు…కొమురం భీమ్. అటువంటి గోండుల బెబ్బులి కొమురం భీమ్ పేరును ఓ అడవి దున్నకు పెట్టటం ఏంటంటూ వివాదాం చెలరేగటంతో ఆ పేరును తొలగించారు జూ అధికారులు.