వర్మ జీఎస్టీ కేసు : ఫోరెనిక్స్ నివేదిక కోసం ఏడాదిన్నరగా పోలీసులు వెయిటింగ్

సంచలన, వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ గాడ్ సెక్స్ ట్రూత్(GST). ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మపై

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 04:01 AM IST
వర్మ జీఎస్టీ కేసు : ఫోరెనిక్స్ నివేదిక కోసం ఏడాదిన్నరగా పోలీసులు వెయిటింగ్

సంచలన, వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ గాడ్ సెక్స్ ట్రూత్(GST). ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మపై

సంచలన, వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ గాడ్ సెక్స్ ట్రూత్(GST). ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మపై చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అశ్లీలతని ప్రమోట్ చేశారని, మహిళలను కించపరిచారని, అసభ్యంగా మాట్లాడారని సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మకి నోటీసులు ఇచ్చారు. ఏడాదిన్నరగా కేసు విచారణ నడుస్తోంది. ఇంకా ఆధారాల కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నగరంలోని ఓ త్రీ స్టార్ హోటల్ లో షూట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలాండ్ లో తీసినట్టు వర్మ చెప్పాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీశాను, లోకేషన్ లో తాను లేను అని వర్మ చెబుతున్నాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఫోరెనిక్స్ అధికారులను ఆశ్రయించారు. వారి నుంచి ఇంకా నివేదిక అందకపోవడంతో.. చర్యలు తీసుకోలేకపోతున్నారు.

హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా అనుభవాలతో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనే చిత్రాన్ని వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీన్ని డైరెక్ట్ గా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేశాడు వర్మ. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆటంకాల మధ్య ‘జీఎస్టీ’ 2018లో రిపబ్లిక్ డే రోజు విడుదల చేద్దామనుకున్నాడు. అప్పుడు వెబ్‌సైట్ క్రాష్ అవడంతో జనవరి 27న ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశాడు.

పోర్న్ స్టార్ మియాను పూర్తి నగ్నంగా చూపిస్తూ సినిమా తీయడం పట్ల వర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అశ్లీతను చూపించారని మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఓ టీవీ చానెల్ లో ఈ సినిమా గురించి చర్చ సమయంలో తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని వర్మపై సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఇంకా నడుస్తోంది.

అశ్లీలతను ప్రమోట్ చేశారని, 66ఏ ఐటీ యాక్ట్ ఉల్లంఘన కింద పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. జీఎస్టీ సినిమా అప్ లోడ్ చేసిన వర్మ ల్యాప్ ట్యాప్ ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆ ల్యాప్ ట్యాప్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. వారి నుంచి తుది నివేదిక కోసం వెయిట్ చేస్తున్నారు.