తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ జాబితా తయారీ.. ముందుగా వారికే

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 12:41 PM IST
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ జాబితా తయారీ.. ముందుగా వారికే

Corona vaccine list preparation in Telangana : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ తుదిదశకు చేరుకొంటోంది. వ్యాక్సిన్ తొలుత ఎవరికి ఇవ్వాలి, తదితర వాటిపై భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ఏర్పాట్లు చేస్తున్నాయి. 2021, జనవరి నెల రెండో వారంలో తెలంగాణ రాష్ట్రానికి కొవిడ్ టీకాలు అందుబాటులోకి వస్తాయనే ప్రచారం జరగుతోంది. దీంతో అర్హులైన టీకా లబ్దిదారుల జాబితాపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. తొలి విడతల్లో రాష్ట్రంలో సుమారు 75 లక్షల మందికి టీకాలు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి ఇవ్వాలనే మార్గదర్శకాల మేరకు అవసరమైన..సమాచారాన్ని కొవిడ్ యాప్‌లో పొందుపరుస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది కలిపి 2 లక్షల 67 వేల 246 మంది నమోదయ్యారని అంచనా. వీరిలో ప్రభుత్వ వైద్య సిబ్బంది లక్షా 25 వేల 007 మంది, ప్రైవేటు వైద్య సిబ్బంది లక్షా 42 వేల 239 మంది ఉన్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో అర్హులైన వైద్య సిబ్బంది 28.73 శాతం మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందిని పరిగణలోకి తీసుకుంటే..ఈ శాతం దాదాపు 42 శాతమనే అభిప్రాయానికి వచ్చింది. జిల్లాలు, ఆసుపత్రుల వారీగా..ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో వేర్వేరుగా వచ్చిన సమాచారం వచ్చిన క్రమంలో..ఆ సమాచారంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ? అనేదానిపై కసరత్తులు జరుపుతున్నారు.

నల్గొండ : 7, 927 (ప్రభుత్వ), 2, 022 (ప్రైవేటు).
నిజామాబాద్ : 5, 828 (ప్రభుత్వ), 3, 170 (ప్రైవేటు).
ఖమ్మం : 6, 886 (ప్రభుత్వ), 7, 514 (ప్రైవేటు).
వరంగల్ పట్టణం : 5,766 (ప్రభుత్వ), 5,688 (ప్రైవేటు).
సిద్ధిపేట : 5, 475 (ప్రభుత్వ), 3, 196 (ప్రైవేటు).

సంగారెడ్డి :
5, 266 (ప్రభుత్వ), 3, 289 (ప్రైవేటు).
కరీంనగర్ : 3, 671 (ప్రభుత్వ), 7, 514 (ప్రైవేటు).
మేడ్చల్ : 2, 000 (ప్రభుత్వ), 8, 050 (ప్రైవేటు).
హైదరాబాద్ : 16, 516 (ప్రభుత్వ), 60, 288 (ప్రైవేటు).
రంగారెడ్డి : 5, 899 (ప్రభుత్వ), 19, 312 (ప్రైవేటు).