హైదరాబాద్‌లో తిరుగుతున్నారా, బీ కేర్‌ఫుల్, ప్రాణాలకే ప్రమాదం

ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా వైరస్ హైదరాబాద్‌నూ తాకింది. మరి ఈ వైరస్‌ను అడ్డుకునే శక్తి మనకు ఉందా? కరోనాను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఎలాంటి

హైదరాబాద్‌లో తిరుగుతున్నారా, బీ కేర్‌ఫుల్, ప్రాణాలకే ప్రమాదం

ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా వైరస్ హైదరాబాద్‌నూ తాకింది. మరి ఈ వైరస్‌ను అడ్డుకునే శక్తి మనకు ఉందా? కరోనాను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఎలాంటి

ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా వైరస్ హైదరాబాద్‌నూ తాకింది. మరి ఈ వైరస్‌ను అడ్డుకునే శక్తి మనకు ఉందా? కరోనాను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 70కిపైగా దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కోవిడ్ 19 వైరస్ నియంత్రించాలంటే మనవల్ల అయ్యేపనేనా.

జలుబు చేసినా జాగ్రత్త పడాల్సిందే:
ఎక్కువ చెప్పడం కాదుగానీ.. సిచ్యుయేషన్ తొందర్లోనే ఇలా మారిపోవచ్చు..ఎందుకంటే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కోరల్లో హైదరాబాద్ కూడా చిక్కుకుపోయింది. ఎటు నుంచి ఎటు వ్యాపిస్తుందో తెలీని ఈ మాయదారి జబ్బు ఇప్పుడు మన మధ్యకి వచ్చేసింది.. కాస్త ఆదమరిస్తే చాలు కాటేయడానికి సిద్ధంగా ఉంది. మీకు కానీ..మీ చుట్టుపక్కల కానీ..ఎవరికైనా కాస్త ముక్కు చీదినట్లుంటే..అలర్ట్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ ఏర్పడింది..మామూలుగా వచ్చే కామన్ కోల్డే అనుకోవద్దు..ఎందుకంటే ఆ నిర్లక్ష్యమే మీ ప్రాణాలు బలి తీసుకోవచ్చు..అంతేకాదు మీతో టచ్‌లో ఉన్న అందరి ప్రాణాలను ప్రమాదంలో పెట్టినట్లే లెక్క.

బయటికి వెళితే తస్మాత్ జాగ్రత్త:
అసలే మనది రద్దీ సిటీ…ఎక్కడ చూసినా జనం..ఎటు చూసినా జనం..ఏ చిన్న ఫంక్షన్ కానీ..పండగ కానీ..అంతెందుకు ఏ చిన్న సంతకి వెళ్లినా.. వందలకొద్దీ జనం అటూ ఇటూ తిరుగుతుంటారు.. ఈ అందరిలో ఎవరు ఈ మహమ్మారిని తమ వెంట తీసుకువచ్చి మనకి అంటిస్తారో తెలీదు. రోడ్ సైడ్ టిఫిన్ బళ్లు..రోడ్డుపైనే నిలబెట్టే తోపుడు బళ్లపై ఆహారపదార్ధాలు.. వీటి చుట్టూ ఈగల్లా మూగి ఆరగించే జనం.. ఏమో ఏ హోటల్ ఓనర్ ఎవరికి ఎలాంటి వైరస్ సప్లై చేస్తాడో ఎవరూహించగలరు..అందుకే తస్మాత్ జాగ్రత్త బైటికి వెళ్లేటప్పుడే కాదు..ఎక్కడకెళ్లినా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కరోనా:
ఎక్కడో చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్..ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేసింది…తెలంగాణలో కోవిడ్ 19 వైరస్ కేసు నమోదైందని కేంద్రం ప్రకటించేవరకూ తెలీదంటే.. ఇదెంత చాప కింద నీరులా విస్తరించిందో అర్ధమవుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ని తొందరగా పట్టుకోవడం అంత ఈజీ కాదు..కావాలంటే గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డ్‌లో చేరిన తాజా పేషెంట్ సంగతే తీసుకోండి..ఈయన బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లాడు..అక్కడ హాంకాంగ్‌ వారితో కలిసి ప్రాజెక్ట్ పని చేసాడు..తిరిగి బెంగళూరు వచ్చాడు..అక్కడ నుంచి బస్సులో హైదరాబాద్‌కి వచ్చాడు..మరి ఈ బస్సులో ఎంతమందిని కలిసాడు..ఆ బస్సు ఎక్కడెక్కడ ఆగింది..ఈయన ఎక్కడెక్కడ దిగాడు తెలుసుకోవడం కష్టం..అలానే బెంగళూరులో ఎక్కడెక్కడ తిరిగాడు..అక్కడెవరికైనా ఈ వైరస్ సోకిందా..మరి వారి నుంచి ఇంకెంతమందికి సోకాలి..అందుకే ఈ గొలుసుకట్టు కనిపెట్టడం కష్టం కాబట్టే..జనం ఇంతగా వణికిపోతున్నారు.

బాంబు ఎప్పుడు పేలుతుందోననే టెన్షన్:
అసలు చైనాలో బ్రేక్ అయినట్లు హైదరాబాద్‌లో వైరస్ కేసులు బయటపడితే పరిస్థితి ఏంటి.. ఊహించడానికే భయం కలుగుతుంది.. ఎఁదుకంటే మనం జీవిస్తున్న పరిస్థితులు అలాంటివి. సిటీలో డైలీ లేబర్..రోడ్డు పట్టనంత జనం..కిలోమీటర్ల కొద్దీ జామయ్యే ట్రాఫిక్..ఒకరిపై ఒకరు నిలబడ్డారా అన్నట్లుగా సాగే సిటీ బస్సులు..ఇంత రద్దీ మధ్య వైరస్ సోకడం చాలా చాలా సులభం..అందుకే ఇప్పుడు హైదరాబాద్ కరోనా బాంబ్‌పై కూర్చున్నట్లైంది. అదెప్పుడు పేలుతుందో తెలీదు..పేలకపోతే మంచిదే..ఓ వేళ పేలితే.. టెన్షనే..