కరోనా బాధిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబసభ్యులకు, అపోలో డాక్టర్లకు కొవిడ్ పరీక్షలు

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా సోకి నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చికిత్స పొందుతుండగా... తాజాగా

  • Published By: veegamteam ,Published On : March 3, 2020 / 06:43 AM IST
కరోనా బాధిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబసభ్యులకు, అపోలో డాక్టర్లకు కొవిడ్ పరీక్షలు

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా సోకి నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చికిత్స పొందుతుండగా… తాజాగా

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా సోకి నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చికిత్స పొందుతుండగా… తాజాగా ఐదుగురు కరోనా అనుమానితులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు ఇటలీ దేశస్తులు. ఒకరు జపాన్, మరొకరు ఇండొనేషియా దేశస్తులుగా గుర్తించారు. ఐదుగురు అనుమానితుల రక్త నమూనాలను గాంధీ డాక్టర్లు సేకరించారు. నిన్న(మార్చి 2,2020) ఒక్క రోజే 15 మంది కరోనా లక్షణాలతో టెస్టులకు వచ్చారని, వారిలో ఆరుగురికి కరోనా నెగిటివ్ వచ్చిందని గాంధీ ఆసుపత్రి కరోనా నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ తెలిపారు. 9మంద రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇక కరోనా బాధితుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కటుంబసభ్యులతో పాటు అతడికి ట్రీట్ మెంట్ చేసిన అపోలో డాక్టర్లు, సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తామన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా:
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 70దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనాతో ఇప్పటికి 3వేల 50మంది మృతి చెందగా.. 89వేల 200మంది చికిత్స పొందుతున్నారు. సౌత్‌ కొరియాలో 25మంది చనిపోతే.. నిన్న ఒక్కరోజే 335కొత్త కేసులు నమోదు కాగా..బాధితుల సంఖ్య 4500కు చేరింది. ఇటలీలో 52మంది మృతి చెంది మరో 1000మంది వైరస్ లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అమెరికాలో ఆరుగురు చనిపోగా..మరో 66మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇటు ఇరాన్‌ లో మృతుల సంఖ్య 66కు చేరగా జపాన్‌ లో బాధితుల సంఖ్య 944కు పెరిగింది.

హైదరాబాద్ లో టెన్షన్..టెన్షన్:
ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా వైరస్ హైదరాబాద్‌లో ప్రవేశించడంతో..నగరవాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే 70 దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా వైరస్ కేసు తొలిసారిగా నగరంలో నమోదు కావడంతో దాన్ని ఎలా ఎదుర్కోవాలనే టెన్షన్ ప్రారంభమైంది. మీరు హైదరాబాద్‌లో తిరుగుతున్నారా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే.. మెట్రోలో ప్రయాణించాలనుకుంటే మాస్క్ తప్పనిసరి. అవసరమైతే తప్పా బయటికి రావొద్దు. ఇది ప్రస్తుతం నగరవాసుల పరిస్థితి. ఎందుకంటే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కోరల్లో హైదరాబాద్ కూడా చిక్కుకుపోయింది. ఎటు నుంచి ఎటు వ్యాపిస్తుందో తెలీని ఈ మాయదారి జబ్బు ఇప్పుడు మన మధ్యకి వచ్చేసింది.. కాస్త ఆదమరిస్తే చాలు కాటేయడానికి సిద్ధంగా ఉంది. మీకు కానీ.. మీ చుట్టుపక్కల కానీ.. ఎవరైనా కాస్త అనారోగ్యంగా కనిపించినా.. అలర్ట్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ ఏర్పడింది.. మామూలుగా వచ్చే జలుబు, దగ్గు అనుకోవద్దు.. ఎందుకంటే ఆ నిర్లక్ష్యమే మీ ప్రాణాలు బలి తీసుకోవచ్చు.. అంతేకాదు మీతో టచ్‌లో ఉన్న అందరి ప్రాణాలను ప్రమాదంలో పెట్టినట్లే అవుతుంది. 

బయటికి వెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త:
అసలే మనది రద్దీ సిటీ.. ఎక్కడ చూసినా జనం.. ఎటు చూసినా జనం.. ఏ చిన్న ఫంక్షన్ కానీ..పండగ కానీ..అంతెందుకు ఏ చిన్న సంతకి వెళ్లినా.. వందలకొద్దీ జనం అటూ ఇటూ తిరుగుతుంటారు. ఈ అందరిలో ఎవరు ఈ మహమ్మారిని తమ వెంట తీసుకువచ్చి మనకి అంటిస్తారో తెలీదు. రోడ్ సైడ్ టిఫిన్ బళ్లు..రోడ్డుపైనే నిలబెట్టే తోపుడు బళ్లపై ఆహారపదార్ధాలు.. వీటి చుట్టూ ఈగల్లా మూగి ఆరగించే జనం.. ఏమో ఏ హోటల్ ఓనర్ ఎవరికి ఎలాంటి వైరస్ సప్లై చేస్తాడో ఎవరూహించగలరు.. అందుకే తస్మాత్ జాగ్రత్త బయటికి వెళ్లేటప్పుడే కాదు..ఎక్కడకెళ్లినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 

కరోనా.. బాంబు ఎప్పుడు పేలుతుందోననే టెన్షన్:
అసలు చైనాలో బ్రేక్ అయినట్లు హైదరాబాద్‌లో వైరస్ కేసులు బయటపడితే పరిస్థితి ఏంటి..ఊహించడానికే భయం కలుగుతుంది.. ఎందుకంటే మనం జీవిస్తున్న పరిస్థితులు అలాంటివి.. సిటీలో డైలీ లేబర్.. రోడ్డు పట్టనంత జనం.. కిలోమీటర్ల కొద్దీ జామయ్యే ట్రాఫిక్.. ఒకరిపై ఒకరు నిలబడ్డారా అన్నట్లుగా సాగే సిటీ బస్సులు.. ఇంత రద్దీ మధ్య వైరస్ సోకడం చాలా చాలా సులభం.. అందుకే ఇప్పుడు హైదరాబాద్ కరోనా బాంబ్‌పై కూర్చున్నట్లైంది. అదెప్పుడు పేలుతుందోనన్న టెన్షన్ నగరవాసులను పట్టి పీడిస్తోంది.