Rajath Kumar IAS: ఐఏఎస్ రతజ్ కుమార్‌పై అవినీతి ఆరోపణల కేసు.. డీవోపీటీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

ఒక ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిపై ప్రధాన కార్యదర్శి ఎలా చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. రతజ్ కుమార్‌ అనే ఐఏఎస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Rajath Kumar IAS: ఐఏఎస్ రతజ్ కుమార్‌పై అవినీతి ఆరోపణల కేసు.. డీవోపీటీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Rajath Kumar IAS: ఐఏఎస్ అధికారి రజత్ కమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు డీవోపీటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోకుండా, నేరుగా తెలంగాణ సీఎస్‌కు పంపుతూ డీవోపీటీ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ కమార్‌పై ప్రధాన కార్యదర్శి ఎలా చర్యలు తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని డీవోపీటీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారని, ఈ అంశంలో రజత్ కమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీవోపీటీకి ఫిర్యాదులు వచ్చాయి. అయితే, ఆయనపై చర్యలు తీసుకోకుండా ఈ అంశాన్ని డీవోపీటీ.. తెలంగాణ సీఎస్‌కు పంపింది.

Ram Temple In Ayodhya: అయోధ్య దేవాలయం ఖర్చు రూ.1,800 కోట్లు.. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తి

దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రతజ్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని తన పిటిషన్‌లో కోరారు. దీనిపై స్పందించిన కోర్టు రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని డీవోపీటీకి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది.