ఆర్టీసీ చార్జీల పెంపు తర్వాత మరో షాక్..?

ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 02:09 AM IST
ఆర్టీసీ చార్జీల పెంపు తర్వాత మరో షాక్..?

ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో

ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో ఛార్జీలు పెంచేందుకే ముందడుగేస్తోంది. అయితే పేదలపై భారం పడకుండా కరెంట్ చార్జీలు పెంచేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

చార్జీలు పెంచడం ద్వారా నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. మొన్న ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా అదే పేరు చెప్పి పెంచారు. అసలే ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని స్వయంగా కేటీఆరే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కరెంట్ చార్జీలు పెంచడానికే మొగ్గుచూపుతోంది తెలంగాణ సర్కార్. 

తెలంగాణ‌లో మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచ‌లేదు. డిస్కంలు రోజురోజుకు న‌ష్టాల బారిన ప‌డుతుండడం.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో టారిఫ్‌లు పెంచ‌క తప్పదని తెలంగాణ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్ భావిస్తుంది. ఇప్పటికే డిస్కంలు చార్జీల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసి ERCకి పంపినట్లు తెలుస్తోంది. ERC తన పూర్తి నివేదిక‌ను ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమవుతోందని స‌మాచారం. 

విద్యుత్ చార్జీల పెంపు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం ఈఆర్‌సీకి కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పేదలపై ఎక్కువ భారం లేకుండా టారిఫ్‌లు సర్దుబాటు చేయాలని సూచించింది. ముఖ్యంగా 100 యూనిట్ల కేటగిరీ ఛార్జీలు పెంచాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఏదేమైనా డిస్కంలను గట్టెక్కించేందుకు ధరలు పెంచక తప్పదని డిసైడ్‌ అయింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రేపో మాపో చార్జీలు పెంచుతామని ప్రకటన చేయడం ఖాయంగా క‌నిపిస్తోంది.

* తెలంగాణలో క‌రెంట్ చార్జీలు పెంపు?
* రంగం సిద్ధం చేస్తున్న డిస్కంలు
* నివేదిక సిద్ధం చేస్తున్న ఈఆర్సీ
* మూడేళ్ల త‌ర్వాత పెర‌గనున్న చార్జీలు?
* 8 నుండి 10 శాతం వరకు పెరుగ‌నున్న చార్జీలు
* పేద‌ల‌పై భారం ప‌డ‌కుండా సర్కార్‌ జాగ్రత్తలు
* ఆర్థిక మాంద్యంతో తగ్గుతున్న ఆదాయం 
* కేంద్రం నుంచి అందని సహకారం
* న‌ష్టాల బారిన డిస్కంలు 
* టారిఫ్‌లు పెంచ‌క తప్పదనే ఆలోచన
* ప్రతిపాదనలను సిద్ధం చేసి ERCకి పంపిన డిస్కంలు 
* నివేదిక‌ను ప్రభుత్వానికి పంపనున్న ERC
* పేదలపై భారం లేకుండా చార్జీల పెంపు
* 100 యూనిట్ల కేటగిరీ చార్జీలపై నిర్ణయం పెండింగ్