సద్దుల బతుకమ్మకు ముస్తాబవుతున్న సాగర తీరం 

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 04:26 AM IST
సద్దుల బతుకమ్మకు ముస్తాబవుతున్న సాగర తీరం 

తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబురాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సెప్టెంబర్ 28న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దీని కోసం ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాన్ని అంత్యం శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. రంగుల రంగుల దీపాలు..ఫ్లెక్సీలులతో ముస్తాబు చేస్తోంది. 

సద్దుల బతుకమ్మ ఉత్సవానికి నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం ముస్తాబవుతోంది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లు అందంగా ముస్తాబవుతున్నాయి. సద్దుల చివరిరోజైన సద్దుల బతుకమ్మ రోజు కోసం ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణం కనిపించేలా హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది. బుద్ధభవన్ నుంచి సంజీవయ్యపార్క్, సాగర్‌పార్క్ కలిపి ఐదు బతుకమ్మ ఘాట్లకు పెయింటింగ్ వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్‌లో ప్రత్యేక అలంకరణతో పాటు, లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యకూడళ్లలో బతుకమ్మ విశిష్టతను తెలుపు తూ పేపర్ బతుకమ్మలు, భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ రోజున పండుగ వాతావరణం అంతా అక్కడే ఉందా అన్నట్లుగా అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతున్నారు.