వర్షాలు..వడగాల్పులు

తెలంగాణలో ఎండలు మండిపోతూనే ఉన్నాయి. ఓ వైపు ఎండలు..మరోవైపు బలమైన వడగాల్పులు వీస్తున్నాయి. దీనితో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. మనుషులతో పాటు జంతువులు కూడా తల్లడిల్లుతున్నాయి. అధిక వేడిమి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఈ ఎండల తీవ్రత, అకాల వర్షాల బెడదర మరో రెండు రోజులు ఉండవచ్చునని హైదరాబాద్ వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 42.1, మెదక్‌లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మహారాష్ట్ర నుండి శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 8గంటల నుండి శనివారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఎక్కువ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. హన్మకొండలో 22.3 మిల్లిమీటర్లు, గున్ గల్‌లో 29.5, రాచులూరు, పైడిపల్లి 28 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.