కేంద్రం రంగంలోకి దిగుతుందా : ఢిల్లీకి తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.

  • Published By: veegamteam ,Published On : November 2, 2019 / 06:00 AM IST
కేంద్రం రంగంలోకి దిగుతుందా : ఢిల్లీకి తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు. శుక్రవారం(నవంబర్ 1,2019) కరీంనగర్ లో ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్ర సమయంలో జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు, ఆర్టీసీ సమ్మె గురించి లక్ష్మణ్ తో చర్చించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్మణ్ ను కోరారు.

ఆర్టీసీ జేఏసీ నేతలతో మాట్లాడిన తర్వాత.. లక్ష్మణ్ వెంటనే ఢిల్లీకి పయనం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులను లక్ష్మణ్ కలవనున్నారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని లక్ష్మణ్ కోరనున్నారని సమాచారం. లక్ష్మణ్ తో మాట్లాడాక.. ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇవాళ్టికి(నవంబర్ 2,2019) 29వ రోజుకి చేరింది. తెలంగాణలోని అన్ని డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. అలాగే ఎంపీ బండి సంజయ్‌ విషయంలో పోలీసుల తీరుపై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమ్మె సహా 30 అంశాలపై చర్చించనుంది. ఆర్టీసీ సమ్మె 29 రోజులకు చేరిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుందని సమాచారం.