దిశ కేసు : మృతదేహాల అప్పగింతపై వీడని సస్పెన్స్‌

దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 02:02 AM IST
దిశ కేసు : మృతదేహాల అప్పగింతపై వీడని సస్పెన్స్‌

దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు

దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో మరికొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేదు. సుప్రీం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కుటుంబ సభ్యులకు నిరీక్షణ తప్పదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మృతదేహాల అప్పగింత అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించనుంది.

దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్‌కౌంటర్‌ జరిగి వారం రోజులైనా… వారి కుటుంబ సభ్యులకు డెడ్‌బాడీలను ఇంకా అప్పగించ లేదు. మొన్నటి వరకు హైకోర్టు డెడ్‌బాడీలను భద్రపర్చాలని ఆదేశించింది. ఇవాళైనా మృతదేహాలు అప్పగిస్తారని ఎదురు చూసిన కుటుంబ సభ్యలకు మరోసారి నిరాశ తప్పలేదు. సుప్రీంకోర్టు మృతదేహాల అప్పగింతపై కీలక ఆదేశాలు జారీ చేసింది. నలుగురు నిందితుల మృతదేహాలను మరికొన్ని రోజులు భద్రపర్చాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని భద్రపర్చాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు మృతదేహాల అప్పగింతపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో నిందితుల అంత్యక్రియలకు మరింత ఆలస్యం కానుంది. తమ వారిని కడసారి చూసుకుందామనుకుంటున్న కుటుంబ సభ్యులకు మరికొన్ని రోజుల నిరీక్షణ తప్పేలా లేదు.

అంతకుముందు నిందితుల మృతదేహాలను భద్రపరిచే అంశంపై గురువారం(డిసెంబర్ 12,2019) కొంత సందిగ్ధం నెలకొంది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ కేసులో మృతదేహాల అప్పగింతపై హైకోర్టులోనూ విచారణ జరిగింది. హైకోర్టు విచారణ సమయానికి సుప్రీంకోర్టు తీర్పు కాపీ పూర్తిగా బయటకు రాలేదు. దాంతో మృతదేహాల విషయంలో స్పష్టత లేదని ధర్మాసనం భావించింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని అడ్వకేట్‌ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. సాయంత్రం సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందడంతో మృతదేహాల అప్పగింతపై అప్పటి వరకు నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ బృందం ఇప్పటికే ఆధారాల సేకరణలో బిజీగా ఉంది. ఘటనా స్థలంలో విచారణ కూడా చేపట్టింది. అయితే సుప్రీంకోర్టు కూడా సిట్‌ దర్యాప్తుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో సిట్‌ బృందం దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది.