పౌరహక్కుల గురించి మాట్లాడేవాళ్లకు కూడా ఆడపిల్లలుంటారని గుర్తుంచుకోవాలి : దిశ తండ్రి

దిశ కుటుంబ సభ్యులు ఎన్ హెచ్ ఆర్ సీ ముందు హాజరయ్యారు. దిశ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 01:18 PM IST
పౌరహక్కుల గురించి మాట్లాడేవాళ్లకు కూడా ఆడపిల్లలుంటారని గుర్తుంచుకోవాలి : దిశ తండ్రి

దిశ కుటుంబ సభ్యులు ఎన్ హెచ్ ఆర్ సీ ముందు హాజరయ్యారు. దిశ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దిశ కుటుంబ సభ్యులు ఎన్ హెచ్ ఆర్ సీ ముందు హాజరయ్యారు. దిశ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు బృందం దాదాపు అరగంట సేపు మాట్లాడింది. న్యాయం చేస్తామని పౌర హక్కుల కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారని దిశ తండ్రి చెప్పారు. ఎన్ కౌంటర్ విషయంలో పోలీసులపై వచ్చిన ఆరోపణలను టీవీలో చూశామని తెలిపారు. పౌరహక్కుల గురించి మాట్లాడేవాళ్లకు కూడా ఆడపిల్లలుంటారని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని దిశ తండ్రి అన్నారు.

ఎన్ హెచ్ ఆర్ సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులు తెలంగాణ పోలీసు అకాడమీకి వెళ్లారు. ఎన్ కౌంటర్ పై దిశ కుటుంబ సభ్యులతో ఎన్ హెచ్ ఆర్ సీ మాట్లాడింది. అంతకముందు నిందితుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించింది దర్యాప్తు బృందం. వారి స్టేట్ మెంట్ రికార్డు చేసింది. మృతుల వ్యక్తిత్వం, అలవాట్లతోపాటు ఎన్ కౌంటర్ పై వారి అభిప్రాయాలను తెలుసుకుంది.

భేటీకి ముందు ఎన్ హెచ్ ఆర్ సీ తీరుపై దిశ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరిగినప్పుడు రాని మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. ఎన్ హెచ్ ఆర్సీ దగ్గరికి మేము వెళ్లడం కాదు.. వారినే మా దగ్గరకు రమ్మని చెప్పామని దిశ తండ్రి అన్నారు. అయితే భద్రతా కారణాలతో మమ్మల్నే పోలీస్ అకాడమీకి రమ్మన్నారని తెలిపారు. దిశ కేసులో జరిగిందంతా ఎన్ హెచ్ ఆర్ సీకి వివరించామన్నారు.

నిన్న(డిసెంబర్ 7,2019) ఎన్ కౌంటర్ ప్రదేశంలో ఎన్ హెచ్ ఆర్ సీ బృందం అణువణువు పరిశీలించింది. నిందితులు దిశను దహనం చేసిన ప్రాంతాన్ని, దిశ స్కూటీని పార్క్ చేసిన స్థలాన్ని కూడా పరిశీలించారు. కొన్ని వీడియోలు తీశారు. ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి వివరాలు తీసుకున్నారు.

ఎన్ కౌంటర్ సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు? దిశను కాల్చిన ప్రాంతానికి, ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎంత దూరం ఉందన్న వివరాలను సేకరించారు. నిందితులు దిశను శంషాబాద్ నుంచి ఎలా తీసుకొచ్చారు… ఆమె మృతదేహాన్ని ఎక్కడ దహనం చేశారన్న విషయాలను శంషాబాద్ డీసీపీ ప్రభాకర్ రెడ్డి దర్యాప్తు బృందానికి వివరించారు.