లోకో పైలెట్ చంద్రశేఖర్ కుడికాలును తొలగించిన వైద్యులు

కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశఖర్ కుడి కాలును కేర్‌ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ.. ఇంకా విషమంగానే ఉంది.

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 08:09 AM IST
లోకో పైలెట్ చంద్రశేఖర్ కుడికాలును తొలగించిన వైద్యులు

కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశఖర్ కుడి కాలును కేర్‌ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ.. ఇంకా విషమంగానే ఉంది.

కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశేఖర్ కుడి కాలును కేర్‌ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. మోకాలు వరకు తొలగించినట్లు డాక్టర్లు తెలిపారు. చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ.. ఇంకా విషమంగానే ఉంది. మూడు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. శేఖర్‌కు రెండు కిడ్నీలు డామేజ్ అయ్యాయి. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం.. పక్క ఎముకలు విరిగిపోయాయి. మరోవైపు తన కుమారుడు స్పృహలోకి వచ్చాడని చంద్రశేఖర్‌ తండ్రి తెలిపారు. నెమ్మదిగా కోలుకుంటున్నట్లు చెప్పారు.

రెండు రైళ్ల ఇంజిన్ల మధ్య ఇరుక్కొని.. నరకయాతన అనుభవించిన లోకోపైలట్ చంద్రశేఖర్‌ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఆయన శరీరం తీవ్రంగా నలిగి బలమైన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో ఆయన పక్కటెముకలు విరిగాయని, మూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి గురై.. పూర్తిగా దెబ్బతిన్నాయని, కాళ్లకు రక్తప్రసరణ కూడా తగ్గిందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంజిన్ల మధ్యలో నుంచి చంద్రశేఖర్‌ను బయటకు తీయగానే.. అతనికి గుండెపోటు వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అతనికి.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 

హంద్రీ ఇంటర్‌సిటీకి సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. ఆ రైలు కళ్ల ముందే కనబడుతున్నా.. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్.. ఎందుకు రైలును ముందుకుపోనిచ్చాడనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్‌గా మారింది. ఇందుకు కారణం ఏమై ఉంటుందనే అంశంపై.. రైల్వే అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది.. లోకోపైలట్ చంద్రశేఖర్ చెబితేనే తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడితేనే.. ప్రమాదానికి గల అసలు కారణం బయటకు వస్తుంది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. అతని తప్పిదం వల్లే ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాచిగూడ స్టేషన్‌ మేనేజర్‌ దశరథ్‌.. రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లడానికి సిగ్నల్‌ ఇస్తే.. చంద్రశేఖర్‌ దాన్ని గమనించకుండా.. ఎంఎంటీఎస్‌ను ముందుకు పోనిచ్చారని కంప్లైంట్‌లో తెలిపారు. దీంతో.. కాచిగూడ జీఆర్పీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ కోలుకున్నాక అతని వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. స్టేషన్ మాస్టర్‌తో పాటు సిగ్నలింగ్ విభాగంలో పనిచేసే వారిని కూడా విచారించనున్నారు పోలీసులు.