మెట్రో పగుళ్లు : ఆ ఫొటోలు సర్కులేట్ చేయొద్దని విన్నపం

హైదరాబాద్ నగర వాసులను మెట్రో పగుళ్లు భయపెడుతున్నాయి. దీంతో పగుళ్లు కనిపిస్తే చాలు ఎలాగైనా ఎల్‌ అండ్‌ టీకి సమాచారమందించాలని ప్రయత్నిస్తున్నారు. చకచకా

  • Published By: veegamteam ,Published On : October 14, 2019 / 03:07 AM IST
మెట్రో పగుళ్లు : ఆ ఫొటోలు సర్కులేట్ చేయొద్దని విన్నపం

హైదరాబాద్ నగర వాసులను మెట్రో పగుళ్లు భయపెడుతున్నాయి. దీంతో పగుళ్లు కనిపిస్తే చాలు ఎలాగైనా ఎల్‌ అండ్‌ టీకి సమాచారమందించాలని ప్రయత్నిస్తున్నారు. చకచకా

హైదరాబాద్ నగర వాసులను మెట్రో పగుళ్లు భయపెడుతున్నాయి. దీంతో పగుళ్లు కనిపిస్తే చాలు ఎలాగైనా ఎల్‌ అండ్‌ టీకి సమాచారమందించాలని ప్రయత్నిస్తున్నారు. చకచకా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌ లోడ్ చేస్తున్నారు. త్వరగా బాగు చేయండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా.. పగుళ్లను ఎప్పుడో బాగు చేశామని.. అయితే పాత ఫొటోలను మళ్లీ సర్క్యులేట్ చేస్తున్నారని మెట్రో అధికారులు చెబుతున్నారు.

మెట్రో పగుళ్లు హైదరాబాద్‌ వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మెట్రో కింది నుంచి వెళ్లాలంటేనే జడుసుకుంటున్నారు. దీంతో మెట్రో పగుళ్లు ఎక్కడ కనబడ్డా ఫొటోలు తీసి ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌లలో పోస్టు చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నారు. పగుళ్లను పూడ్చాలని కోరుతున్నారు. మెట్రో భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రిస్టోరేషన్ పనులు చేపడుతున్నామన్నారు. సోషల్ మీడియాలో పాత ఫొటోలు సర్క్యులేట్ చెయ్యొద్దని మెట్రో అధికారులు కోరారు. రీస్టోరేషన్‌ పనులు చేస్తున్నామని ఎల్ అండ్ టీ చెబుతున్నప్పటికీ చాలా చోట్ల పగుళ్లు  కనబడుతున్నాయి. 

అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడిపడి మౌనిక మృతిచెందిన ఘటన ఇంకా నగరవాసులను వెంటాడుతూనే ఉంది. స్టేషన్ పరిసరాల్లోకి వెళ్తే చాలు వారి కళ్లు పైకే చూస్తున్నాయి. స్టేషన్‌ను పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మెట్రో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటున్నారు నగరవాసులు

ఇటీవల ఉప్పల్ మెట్రో స్టేషన్., ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ల దగ్గర ఏర్పడ్డ పగుళ్లను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మెట్రో అధికారులు వాటికి రిపేర్లు చేశారు. మెట్రో భద్రతను ఇంజినీర్ల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. పగుళ్లున్న చోట మరమ్మతులు చేస్తుంది. కొన్ని స్టేషన్ల దగ్గర పనులు పూర్తి కాగా మరికొన్ని స్టేషన్ల దగ్గర మాత్రం ఇంకా పగుళ్లు అలాగే కనిపిస్తున్నాయి. మెట్రో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. పగుళ్లను ఎప్పటికప్పుడు రిపేర్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.