మిమ్మల్ని మీరు చంపుకోకండి, కేసీఆర్ మాట వినండి: ఒవైసీ

మిమ్మల్ని మీరు చంపుకోకండి, కేసీఆర్ మాట వినండి: ఒవైసీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆర్టీసీలో 50శాతం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. 48వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగడం కారణంగా ఇది జరిగింది. టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమే దీనికి కారణం.

నాకు మీ బాధ అర్థమైంది. ముఖ్యమంత్రి దగ్గరకు మీ వాదనను తీసుకువెళతాను. సమ్మెలో కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. ప్రాణాలు తీసుకోకండి. సీఎం చెప్పిన మాట వినండి. కూర్చొని సమస్యను పరిష్కరించుకోండి. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాట విని మోసపోకండి. ఇది మీ మాతృభూమి. తెలంగాణ మీది.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో మాట్లాడాను. ఆర్టీసీని తొలగించడం లేదు. ప్రైవేటీకరణ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ పై జెడ్ అనే అక్షరంతో ఉన్న బస్సులు తొలగించరు. అది హైదరాబాద్ ఆఖరి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి పేరు జెహ్రాలోని మొదటి అక్షరం. ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక భాగం’ అని ఒవైసీ మాట్లాడారు.