ప్రయాణికులు ఆందోళన చెందవద్దు..కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం : మెట్రో రైలు ఎండీ

  • Published By: chvmurthy ,Published On : March 3, 2020 / 10:34 PM IST
ప్రయాణికులు ఆందోళన చెందవద్దు..కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం : మెట్రో రైలు ఎండీ

హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) కేసు నమోదైన నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రకటనల ద్వారా కరోనాపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామన్నారు.

See Also | ట్యాక్సీ గా మారిన రోల్స్ రాయిస్ కార్

రైళ్లలో ప్రజలు తాకే అన్ని ప్రదేశాల్లో  ప్రత్యేకంగా పరిశుభ్రతకు చర్యలు చేపట్టామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. కరోనాపై మంత్రులు కేటీఆర్, ఈటల నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, మెట్రో ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. కరోనా విషయంలో భయాందోళన చెందవద్దని,  ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.