Dussehra-2022: సొంతూళ్లకు ప్రజలు.. హైదరాబాద్‌ సగం ఖాళీ.. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నా దొరకని టికెట్లు

తెలంగాణ రాష్ట్ర ఆర్టసీ ప్రత్యేకంగా 4,198 బస్సులు నడుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి 1,090 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇన్ని వేల బస్సులు నడుపుతున్నప్పటికీ వేలాది మందికి బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో అప్పుడే సీట్ల రిజర్వేషన్లు దొరకడం లేదు. తెలంగాణలో దసరాను అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు. సొంతూళ్లకు ప్రజలు వెళ్తుండడంతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది.

Dussehra-2022: సొంతూళ్లకు ప్రజలు.. హైదరాబాద్‌ సగం ఖాళీ.. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నా దొరకని టికెట్లు

TSRTC

Dussehra-2022: దసరా పండుగ నేపథ్యంలో సెలవులు దొరకడంతో హైదరాబాద్‌ నుంచి లక్షలాది మంది ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుపుతున్నా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్‌ బస్సుల ఆపరేటర్లు రేట్లను రెండు, మూడు రెట్లు పెంచి దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ దసరా పండుగ ప్రత్యేక బస్సుల్లో ఈ సారి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆర్టసీ ప్రత్యేకంగా 4,198 బస్సులు నడుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి 1,090 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

ఇన్ని వేల బస్సులు నడుపుతున్నప్పటికీ వేలాది మందికి బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో అప్పుడే సీట్ల రిజర్వేషన్లు దొరకడం లేదు. తెలంగాణలో దసరాను అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు. సొంతూళ్లకు ప్రజలు వెళ్తుండడంతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. నగరంలోని రహదారులపై వాహనాల సంఖ్య తగ్గిపోయింది. ట్రాఫిక్‌ రద్దీ కన్పించడం లేదు.

మరోవైపు పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇవాళ సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌-కటక్‌ మీదుగా సంత్రాగచికి ప్రత్యేక రైలు-07645 నడుస్తుంది. రేపు సంత్రాగచి నుంచి సికింద్రాబాద్‌కు-07646 రైలు, ఎల్లుండి సికింద్రాబాద్‌-షాలిమార్‌ రైలు-07741, అక్టోబరు 3న షాలిమార్‌-సికింద్రాబాద్‌ రైలు-07742 నడుస్తాయి. అలాగే, అక్టోబరు 1, 8న నాందేడ్‌- బర్హంపూర్‌ రైలు-07431, త్రివేండ్రం-టాటానగర్‌ రైలు-06192, అక్టోబరు 2, 9న బర్హంపూర్‌- నాందేడ్‌ ప్రత్యేక రైలు-07432, అక్టోబరు 4, 11న టాటానగర్‌-త్రివేండ్రం ప్రత్యేక రైలు-06191 నడుస్తుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..