ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ

10TV Telugu News

తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా శనివారం (అక్టోబర్ 5) ఎనిమిదవ రోజు బతుకమ్మ పండుగను వెన్నముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు. వెన్నముద్దల బతుకమ్మ కోసం ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు, మరియు జగ్గరి (బెల్లం) తో చేసిన వంటకాని తయారు చేస్తారు.

ఎనిమిదవ  వెన్నముద్దల బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు పూలతో మరింత ఎత్తుగా అంటే ఎనిమిది అంతరాలుగా  బతుకమ్మగా పేర్చి..ఇంటి దగ్గర కాకుండా దేవాలయం దగ్గర ఆడబిడ్డలంతా చేరి ఆట,పాటల బతుకమ్మను కొలుచుకుని చెరువులో నిమజ్జనం చేస్తారు. వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

ఇప్పటికే ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ  వేడుకలు ముగిశాయి. ఈరోజు వెన్నముద్దల బతుకమ్మ సంబురాలను తెలంగాణ ఆడబిడ్డలు జరుపుకుంటారు. ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు, మరియు జగ్గరి (బెల్లం) తో చేసిన వంటకాని తయారు చేస్తారు.