బిగ్ డెసిషన్ : 10 ఎకరాలు ఉంటే రేషన్ కట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2019 / 10:39 AM IST
బిగ్ డెసిషన్ : 10 ఎకరాలు ఉంటే రేషన్ కట్

రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్హులకు మాత్రమే ఆహార భధ్రత కార్డులిచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. 10 ఎకరాలు, అంతకుమించి భూమి కలిగి ఉండి, రైతు బంధు స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నవారికి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 10 ఎకరాలు పైబడిన భూమి కలిగి ఉన్నవారు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ గుర్తించింది.
Also Read : డేంజర్ ఢిల్లీ : ప్రపంచంలోనే కాలుష్య రాజధాని

ఫిబ్రవరి-25న పౌరసరఫరాల శాఖ సంబంధిత అధికారులు, ఎన్ఐసీ అధికారులతో హైదరాబాద్ లో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నట్లు ఈ మీటింగ్ లో అధికారులు తేల్చారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి 6కేజీల బియ్యం ఇస్తుంది. రైతు బంధు స్కీమ్ పై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.
Also Read : పాక్ వీడియో రిలీజ్ : భారత సబ్ మెరైన్ అడ్డుకున్నాం