EXCLUSIVE: 10 టీవీ చేతిలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ FIR కాపీ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎఫ్ ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. నలుగురు నిందితుల వయస్సు 19 ఏళ్లని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 07:16 AM IST
EXCLUSIVE: 10 టీవీ చేతిలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ FIR కాపీ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎఫ్ ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. నలుగురు నిందితుల వయస్సు 19 ఏళ్లని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎఫ్ ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. నలుగురు నిందితుల వయస్సు 19 ఏళ్లని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు. డిసెంబర్ 6న నిందితులను చటాన్ పల్లికి తీసుకెళ్లామని వెల్లడించారు. బాధితురాలి వస్తువులు రికవరీ కోసం వారిని తీసుకెళ్లామని పోలీసులు చెప్పారు. షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదు మేరకు ఎన్ కౌంటర్ పై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ ఐఆర్ కాపీలో ఉంది. 

నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నాక డిసెంబర్ 6న సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం నిందితులను చటాన్ పల్లి బ్రిడ్జీ దగ్గరకు తీసుకెళ్లారు. ఉదయం 6.10 సమయంలో నిందితులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. నిందితులు పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కొని, వారిని చంపాలని చూశారు. నిందితులు రాళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్పివచ్చిందన్నారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయినట్లు పోలీసులు ఎఫ్ ఐఆర్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఏసీపీ సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్ నగర్ పోలీసులపై కేసు నమోదు చేశారు. 

దిశ హత్య అనంతరం నిందితుల వయస్సు 20 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఐపీసీ 307, 224, 294, ఐపీసీ 394, 174, 176 కింద అనుమానాస్పద మృతి కింద షాద్ నగర్ పోలీసులపై కేసు నమోదు చేశారు. దిశకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసుల దగ్గరే ఉంది. చర్లపల్లి జైలు నుంచి నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. డిసెంబర్ 6న ఘటనా జరిగిన చటాన్ పల్లి బ్రిడ్జీ దగ్గరికి తీసుకొచ్చారు. దిశ హత్య జరిగిన ప్రదేశం నుంచి ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి దాదాపు 300 మీటర్లు ఉంటుంది. అక్కడ దిశ వస్తువులు దాచామని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే మొదటగా మహ్మద్ ఆరీఫ్ పోలీసులపై దాడి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం పది మంది పోలీసులు నలుగురు నిందితులను అక్కడికి తీసుకెళ్లారు. నిందితులు రాళ్లు రువ్వారని, కర్రలతో దాడి చేశారని, వెపన్స్ లాక్కొన్నారని పోలీసులు చెప్పారు. ఏ1 ఆరీఫ్, ఏ4 చెన్నకేశవులు రెండు వెపన్స్ లాక్కొని కాల్పులు జరిపారని..ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణలో భాగంగానే వారిపై కాల్పులు జరిపామని ఎఫ్ ఐఆర్ లో పోలీసులు వెల్లడించారు.