భానుడి భగ భగ 

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 01:47 AM IST
భానుడి భగ భగ 

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎండ వేడిమికి జనం అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ 17 బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 18 గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. 

దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది.