ESI-IMS స్కామ్‌లో బయటపడుతున్న నిజాలు

ESI-IMS స్కామ్‌లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో IMS అధికారిక పత్రాలు దొరుకున్నాయి.

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 10:51 AM IST
ESI-IMS స్కామ్‌లో బయటపడుతున్న నిజాలు

ESI-IMS స్కామ్‌లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో IMS అధికారిక పత్రాలు దొరుకున్నాయి.

ESI-IMS స్కామ్‌లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో IMS అధికారిక పత్రాలు దొరుకున్నాయి. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ కార్యాలయంలో ఉండాల్సిన ఇండెట్లు, పర్చేజ్‌ ఆర్డర్లు నిందితుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అరెస్టైన నిందితుల ఇళ్లతో పాటు అనుమానితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగరాజు ఇంట్లో 46 కోట్ల రూపాయల విలువైన ఒరిజినల్‌ ఇండెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

ఈఎస్‌ఐ-ఐఎమ్‌ఎస్‌ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోని 100 డిస్పెన్సరీల్లో అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోంది. వరంగల్‌ జేడీ పద్మపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా పద్మ జేడీ ప్రమోషన్‌ కొట్టేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పద్మకోసం స్పెషల్‌ జీవోను అప్పటి ప్రభుత్వం తెచ్చింది. ఒకే పోస్టులో 12 ఏళ్లుగా పద్మ కొనసాగుతోంది. శాఖలో పట్టు పెంచుకుని అవినీతికి స్కెచ్‌ వేసినట్లు భావిస్తున్నారు. 

ఈఎస్ ఐ ఐఎమ్‌ఎస్‌ కుంభకోణంలో అనేకరకాలైన సంఘనలు వెలుగు చూస్తున్నాయి. పద్మకు సంబంధించి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లోని 100 డిస్పెరీల పరిధిలో జెడీ పద్మకు సంబంధించిన జురిడిక్షన్ అంతకూడా అవినీతి సామ్రాజ్యంగా మార్చుకుంది. 100 డిస్పెరీలకు ఆమెకు అధికారిగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పద్మ జెడీగా ప్రమోషన్ తీసుకుంది.

సీనియర్స్ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం పద్మకు ప్రమోషన్ కట్టబెడుతూ జీవో విడుదల చేసింది. నాగాభూషణం డైరెక్టర్ గా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసి ఆమెకు ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లాబీయింగ్ తీసుకున్న తర్వాత జెడీ పద్మకు ప్రమోషన్ ఇచ్చారు. జేడీగా ప్రమోషన్ ఇవ్వడంతోనే అవినీతికి కేంద్రంగా మార్చుకుంది.

డిస్పెన్షరీలన్నింటిల్లోనూ లాంగ్ స్టాండ్ కావడంతోనే అవినీతి చేయడానికి అస్కారం ఏర్పడింది. ఒకే పోస్టులో 12 సంవత్సరాలు కొనసాగింది. ఆమె కంటే ముందుగా ఉన్న ఆరుగురు డైరెక్టర్లు మారారు. కానీ పద్మకు మాత్రం స్థాన చలనం కలగలేదు. పూర్తిగా శాఖపై పట్టు పెంచుకొన్న పద్మ అవినీతికి స్కెచ్ వేసింది.

సన్నిహితులను తయారు చేసుకున్న తర్వాత ఈ-టెండర్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికిన ఆమె తన ఇష్టారాజ్యంగా మందులను కొనుగోలు చేసింది. డిస్పెరీలను అవినీతి కేంద్రాలుగా మార్చింది. రెండేళ్ల నుంచే పద్మ అవినీతికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మొత్తం 17 మంది సిబ్బంది ఇందులో ఇన్ వాల్వ్ అయ్యారు.