నిలువెత్తు నిర్లక్ష్యం : రావత్, రజత్‌ల పేర్లపై నకిలీ ఓటర్ కార్డులు

హైదరాబాద్ : ఎన్నికల అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో విమర్శలు ఎదురైనా పదే పదే తప్పులు చేస్తూ తమ డొల్లతనాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 04:43 PM IST
నిలువెత్తు నిర్లక్ష్యం : రావత్, రజత్‌ల పేర్లపై నకిలీ ఓటర్ కార్డులు

హైదరాబాద్ : ఎన్నికల అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో విమర్శలు ఎదురైనా పదే పదే తప్పులు చేస్తూ తమ డొల్లతనాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా

హైదరాబాద్ : ఎన్నికల అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో విమర్శలు ఎదురైనా పదే పదే తప్పులు చేస్తూ తమ డొల్లతనాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ఈసీ చీఫ్ రజత్ కుమార్, కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్ పేర్లపై నకిలీ ఓటర్ ఐడీ కార్డులు జారీ చేయడం సంచలనంగా మారింది. అసలు దోషులను పట్టుకునేందుకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

 

ఓ వైపు ఎన్నికల సంఘం బోగస్ ఓటర్ ఐడీ కార్డులను ఏరివేస్తుంటే… ఎన్నికల అధికారుల పేర్లపైనే నకిలీ గుర్తింపు కార్డులు జారీ చేయడం కలకలం రేపింది. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్, కేంద్ర మాజీ ఎన్నికల అధికారి ఓపీ రావత్ పేర్లపై ఓటర్ ఐడీ కార్డులు జారీ చేసి మరోసారి తమ పనితనాన్ని చాటుకుంది ఈసీ. నాంప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలోని ఒవైసిపురాలో ఓపీ రావత్‌కు ఎన్నికల అధికారులు ఓటు హ‌క్కు క‌ల్పించారు. ప‌క్కనే ఉండే బీసీ వ‌డ్డెర బ‌స్తీ క‌మ్యూనిటీ హాల్‌లో ఓటు హక్కును  వినియోగించుకోవాలంటూ పోల్ స్లిప్‌ను కూడా పంపిణీ  చేశారు. ఇక రజత్ కుమార్‌కు మెహిదీపట్నంలో ఓటు హక్కు కల్పించారు.

 

ఒకరికి ఓటుహక్కును కల్పించడంలో ఎన్నో అంశాలను పరిశీలించాల్సిన అధికారులు ఈ తంతును తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్న నిదర్శనాలే కనిపిస్తున్నాయి. ఓపీ రావత్ ఓటును ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్న అధికారులు… దానిని ప్రింట్ తీసుకుని సంబంధిత అడ్రస్‌లో వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానిని సూపర్ వైజరీ ఆఫీసర్ .. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రాండమైజ్ పద్ధతిలో గ్రౌండ్ స్థాయిలో పరిశీలించాలి. నిజానికి ఈ ఆర్వో ప్రతి దరఖాస్తును తన లాగిన్ నుండి సర్టిఫై కూడా చేయాల్సి ఉంటుంది. అలా చేసేటప్పుడైనా ఈ విషయాన్ని గుర్తించవచ్చు. కానీ అదీ జరగలేదు.

 

ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్, కేంద్ర మాజీ ఈసీ చీఫ్ ఓపీ రావత్ పేర్లపై నకిలీ ఐడీ కార్డులు ఇవ్వడంలోనే ఈసీ ఏ రేంజ్‌లో పనిచేస్తుందో అర్ధమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇద్దరి పేర్లు వరుసగా ఉన్నా ఎవరి దృష్టిలో పడకపోవడం, ఇప్పటివరకూ రజత్ కుమార్‌ బూత్ లెవల్ అధికారులతో పలుసార్లు నేరుగా సమావేశమయినా…సంబంధిత బిఎల్వో ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఇంట‌ర్నల్‌గా విచారించిన బ‌ల్దియా అధికారులు… ఎలాంటి క్లూ దొర‌క‌క‌పోవ‌డంతో సెంట్రల్ క్రైమ్ స్టేష‌న్‌కు ఫిర్యాదు చేశారు.

 

* ఎన్నికల అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం
* ఓపీ రావత్, రజత్ కుమార్ పేర్లపై నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు
* సీసీఎస్‌లో ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు