Flight Rrestaurant in Hyderab : విమానంలో రెస్టారెంట్ .. మన హైదరాబాద్‌లోనే
విమానంలో రెస్టారెంట్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ లో ఆహార ప్రియులకు చక్కటి అనుభూతిని అందించటానికి పిస్తా హౌస్ ‘విమానంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్’లో కూర్చుకుని తినే అనుభూతిని అందించనుంది.

Flight Rrestaurant in Hyderab : విమానంలో రెస్టారెంట్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ లో ఆహార ప్రియులకు చక్కటి అనుభూతిని అందించటానికి పిస్తా 150 సీట్లతో ‘విమానంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్’లో కూర్చుకుని తినే అనుభూతిని అందించనుంది. ఆహార ప్రియులను తమదైనశైలిలో రుచులతో కట్టిపడేసే పిస్తా హౌస్ విమానంలో రెస్టారెంట్ ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ నగరంలోనే మొదటిసారిగా విమానంలో రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది. దీని కోసం ఓ విమానాన్ని కొనుగోలు చేసింది. ఓ పాత విమానాన్ని కేరళలో వేలం వేయగా పిస్తా హౌస్ యాజమాన్యం దాన్ని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.
ఈ విమానాన్నే త్వరలో హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్ పేటలో ఫ్లైట్ రెస్టారెంట్ గా ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా పరిసరాలను మార్చేస్తోంది. రన్ వే, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లో టికెట్లు తదితర ఏర్పాట్లను చేసింది. విమానంలో 150 సీట్లను ఏర్పాటు చేశారు. ఎంచెక్కా విమానంలో కూర్చొని.. అటు శామీర్ పేట చెరువు అందాలను తనివి తీరా ఆస్వాదిస్తూ..ఇటు పిస్తా హౌస్ రుచులను ఆస్వాదించే మధురానుభూతిని అందించనుంది. రుచికరమైన వంటకాలతో పాటు అత్యాధునిక సదుపాయాలతో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ను తీర్చిదిద్దనుంది పిస్తా హౌస్ యాజమాన్యం. ఈ విమానంలో ఇందులో మొత్తం150 సీట్లు ఉంటాయి. విమానంలోకి ప్రవేశించేందుకు వీలుగా ఎస్కలేటర్ ను కూడా ఉంటుంది.
ఎప్పుడెప్పుడా అని ఆతృతపడుతున్నారా? ఈ విమానం రెస్టారెంట్ డిసెంబర్ లేదా 2023 జనవరికల్లా అందుబాటులోకి రానుంది. కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ నగరానికి విమానాన్ని తీసుకురావడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లాలోని అండర్ పాస్ లో ఆ విమానాన్ని తీసుకొస్తుండగా ఇరుక్కుపోయింది. మేదర్‌మెట్ల పోలీసుల సహకారంతో విమానంను బయటికి తీశారు. ఆ తర్వాత కొరిసపడు అండర్ పాస్ నుంచి విమానాన్ని తరలించారు.ఈ ఫ్లైట్ రెస్టారెంట్ హైదరాబాద్‌లో మొట్టమొదటిదే కావటం విశేషం. కానీ భారత్ లో ఇటువంటివి విమానం రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి.
పాట్నాలోని హాజీపూర్, హర్యానాలోని గుర్గావ్, గుజరాత్‌లోని వడోదర వంటి నగరాల్లో ఇప్పటికే విమానం రెస్టారెంట్లు ఆహార ప్రియుల్ని అలరిస్తున్నాయి. వడోదరలోని తర్సాలి బైపాస్‌లో గత ఏడాది ఫ్లైట్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ స్టారెంట్‌లో వెయిటర్లు, సర్వర్లు ఎయిర్ హోస్టెస్ తరహాలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఏర్పాటుకానున్న పిస్తా హౌస్ ఫ్లైట్ రెస్టారెంట్లో కూడా ఇదే మోడల్‌ను అనుసరిస్తారని సమాచారం.