HCA అధ్యక్ష బరిలో అజారుద్దీన్

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 10:42 AM IST
HCA అధ్యక్ష బరిలో అజారుద్దీన్

త్వరలో జరగనున్న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA)అధ్యక్ష ఎన్నికల బరిలోకి టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ దిగారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను అజార్ అందజేశారు. 

ఈ సందర్భంగా అజహర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ క్రికెట్‌ కు పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేస్తాను. జిల్లా స్థాయిలోనే చాలా టాలెంటెడ్‌ క్రికెటర్స్‌ ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి దాదాపు 7-8 మంది క్రికెటర్స్‌ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కింది స్థాయి నుంచే క్రికెటర్లను తీర్చిదిద్దాలనీ, వారికి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.  ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం అందుబాటులోకి వచ్చిన నుంచి ఎల్‌బీ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడం లేదని, ఈ ప్రఖ్యాత మైదానంలో ఎన్నో గొప్ప మ్యాచ్‌లు జరిగాయని, ఇపుడు రాజకీయ మీటింగులకు అడ్డాగా మారిందని, ఎల్‌బీ స్టేడియంలో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా చూస్తానని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల్లో అజహర్‌తో పాటు మరో తొమ్మిది మంది వివిధ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ అధ్యక్ష పదవికి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు.