నాంపల్లి నుమాయిష్ గుడ్ న్యూస్ : ఈ ఒక్కరోజు మహిళలకు ఫ్రీ ఎంట్రీ

  • Edited By: veegamteam , January 7, 2020 / 04:24 AM IST
నాంపల్లి నుమాయిష్ గుడ్ న్యూస్ : ఈ ఒక్కరోజు మహిళలకు ఫ్రీ ఎంట్రీ

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమైన నుమాయిష్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.  సోమవారం (జనవరి6,2020) పది వేల మంది నుమాయిష్‌ను సందర్శించారు. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్‌‌కు మహిళలకు  ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించారు. ఇది మహిళలకు మాత్రమే. లేడీస్‌ కు ఫ్రీ ఎంట్రీ డే సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేశారు. 

కాగా..2019తో జరిగిన అగ్నిప్రమాదం, ప్రజల భద్రత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.  నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్‌ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఎగ్జిబిషన్ జనవరి 1, బుధవారం ప్రారంభమైంది.  జనవరి నెల వచ్చిందంటే హైదరాబాద్ వాసులకు నుమాయిష్‌ గుర్తుకొస్తుంది. 

ప్రతి సంవత్సరం లాగానే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజులపాటు నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. గతంలో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశ మార్గాలతో పాటుగా అదనంగా మరో ఆరు మార్గాలను ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రతా ప్రమాణాలకు రూ.3 కోట్లు ఖర్చు చేసారు. ఎగ్జిబిషన్‌ నిర్వహణ జరిగినన్ని రోజులు సందర్శకుల సౌకర్యార్థం మెట్రో రైలు సర్వీసులు రాత్రి 11 గంటల వరకు నడపనున్నారు.