మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్లో కంటిన్యూగా ఇంటర్నెట్ పొందేందుకు

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 02:57 AM IST
మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్లో కంటిన్యూగా ఇంటర్నెట్ పొందేందుకు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్లో కంటిన్యూగా ఇంటర్నెట్ పొందేందుకు అవసరమైన టెక్నాలజీని షుగర్ బాక్స్ సంస్థ అందించనుంది. ఈ మేరకు మెట్రో రైల్ కారిడార్లలోనూ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి రెండు సంస్థలూ మంగళవారం(డిసెంబర్ 10,219) ఒప్పందం చేసుకోనున్నాయి.

ఒప్పందం తర్వాత హైదరాబాద్ మెట్రో రైళ్లలో ‘5జీ’ మొబైల్ సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రయాణికులు ఉచితంగా ఇంటర్ నెట్ సేవలు పొందుతారు. కొన్ని మెట్రో స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత అన్ని స్టేషన్లకు ఈ సేవలు విస్తరిస్తారు. 5జీ మొబైల్ అప్లికేషన్ సేవల ద్వారా ప్రయాణికులు మొబైల్ డేటా లేకుండానే వీడియోలు చూసేందుకు అవకాశం ఉంది.

మెట్రో రైలు గ్రేటర్ వాసులకు చాలా ఉపయోగంగా ఉంటోంది. మెట్రోకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. లక్షలాదిమంది మెట్రోరైళ్లను ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోవడం, జర్నీకి ఎక్కువ సమయం పట్టకపోవడం ప్లస్ అయ్యాయి. దీంతో తమ వాహనాలను పక్కన పెట్టి మరీ మెట్రో రైల్లో జర్నీకి నగరవాసులు ఆసక్తిచూపుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఇందులోనే వెళ్తున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో మెట్రోకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మెట్రో ద్వారా లక్షలాది మంది ప్రయాణించారు. దీంతో మెట్రో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అన్ని మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.