టీవీ9లో రవిప్రకాశ్ రూ.18 కోట్ల చీటింగ్

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 08:29 AM IST
టీవీ9లో రవిప్రకాశ్ రూ.18 కోట్ల చీటింగ్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది. ఏబీసీఎల్ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, టీవీ 9 మాజీ సీఎఫ్ వో మూర్తిపై టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మూర్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

టీవీ9(ఏబీసీఎల్)లో భారీగా నిధుల కుంభకోణం జరిగినట్టు నిర్ధారించారు. టీవీ9 మాజీ సీఈవో, సీఎఫ్ వో మూర్తిపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోనస్ ల పేరుతో బోగస్ రికార్డులు క్రియేట్ చేసి డబ్బు స్వాహా చేసినట్టగా గుర్తించారు. రవిప్రకాశ్, మూర్తిలపై పోలీసులు సెక్షన్ 409, 418, 420, 509 కింద కేసులు నమోదు చేశారు.
 

* టీవీ9 అకౌంట్స్‌ నుంచి భారీగా నిధులు కొట్టేసిన రవిప్రకాశ్‌
* అనధికారికంగా రూ.18 కోట్లకు పైగా నిధుల డ్రా
* చెక్‌పవర్‌ను దుర్వినియోగం చేసిన రవిప్రకాశ్‌, మాజీ సీఎఫ్ వో ఎంకేవీఎన్‌ మూర్తి
* బోనస్‌, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసిన రవిప్రకాశ్‌, మూర్తి
* కొత్త యాజమాన్యం రికార్డుల తనిఖీల్లో బయటపడ్డ రవిప్రకాశ్ దోపిడీ
* డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్ల అనుమతి లేకుండా నిధులు డ్రా చేసిన రవిప్రకాశ్‌
* క్లిఫోర్డ్‌ పెరీరాకూ అక్రమంగా రూ.5.97 కోట్ల బోనస్‌ను జారీ చేసిన రవిప్రకాశ్‌
* 2017-18, 2018-19లో ఏబీసీఎల్‌కు వచ్చిన లాభాలకు సరిపడా నిధులను అక్రమంగా తీసుకున్న రవిప్రకాశ్‌, మూర్తి
* సెప్టెంబర్‌ 18, 2018 నుంచి మే 8, 2019 మధ్య మూడు సార్లు బోనస్‌ల పేరిట డబ్బు డ్రా చేసిన రవిప్రకాశ్‌, మూర్తి
* 2018 ఆగస్టులో ఏబీసీఎల్‌లో 90.54 శాతం షేర్లు కొనుగోలు చేసిన అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌
* ఏబీసీఎల్‌ యాజమాన్య హక్కులు పూర్తిగా అలంద మీడియావే
* అలంద మీడియా అనుమతి లేకుండా అక్రమంగా బోనస్‌ తీసుకున్న రవిప్రకాశ్‌, మూర్తి
* బోనస్‌గా ఇచ్చినట్లు రికార్డుల్లో రాయమంటూ రవిప్రకాశ్ ఆదేశం

రవిప్రకాశ్‌ అక్రమంగా తీసుకున్న డబ్బు
18.09.2018న రూ.1,80,00,000
11.03.2019న రూ.1,56,00,000
08.05.2019న రూ.3,00,00, 000
మొత్తం రూ.6,36,00,000

ఎంకేవీఎన్‌ మూర్తి అక్రమంగా తీసుకున్న డబ్బు
24.10.2018 & 10.12.2018న – రూ.3,97,87,500
08.05.2019న – రూ.2,00,00,000
మొత్తం రూ.5,97,00,000

ఇంత భారీగా నిధులను తీసుకోవడానికి రవిప్రకాశ్‌కు అధికారమెక్కడిది..?
సంస్థను ముంచి సొంత అకౌంట్లను నింపుకున్న రవిప్రకాశ్‌