గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైవోవర్ మూడురోజుల పాటు మూసివేత

గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజులపాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 11:16 AM IST
గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైవోవర్ మూడురోజుల పాటు మూసివేత

గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజులపాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో సత్యవేణి అనే మహిళ మృతి చెందింది. ఆమె కూతురు ప్రణీతతోపాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. వరుసగా ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజులపాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై వేగాన్ని నియంత్రించేందుకు జీహెచ్ ఎంసీ చర్యలు చేపట్టనుంది. అధికారులతో సంప్రదించిన తర్వాత ఫ్లైవోవర్ పై మూడు రోజులపాటు రాకపోకలను ఆపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై కారు ప్రమాదం ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫ్లైవోవర్ పై ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో అధ్యయనం చేసి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

గచ్చిబౌలి బయోడైవర్సిటీ దగ్గర కొత్తగా నిర్మించిన ఫ్లైవోవర్ ను ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది వారాల క్రితమే ఫ్లైవోవర్ పై నుంచి ఓ వాహనం కిందపడి పడింది. మళ్లీ ఇవాళా అదే ఫ్లైవోవర్ పై నుంచి మరో కారు కింద పడటంతో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు గాయపడ్డారు. సీపీ సజ్జనార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. (అక్టోబర్10, 2019) ఇదే ప్లైఓవర్‌ పైనుంచి బైక్‌ కిందపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.