గిన్నిస్ బుక్ లో గాంధీ ఆసుపత్రి 

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 03:35 AM IST
గిన్నిస్ బుక్ లో గాంధీ ఆసుపత్రి 

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సరికొత్త రికార్డు సృష్టించింది.గంట (60 నిమిషాలు) సమయంలో వ్యవధిలో అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఇంత ఫాస్ట్ గా దేశంలోని ఏ కేంద్రంలో కూడా జరగలేదని.. ఈ పోటీ దేశంలో 37 కేంద్రాల్లో ఏకకాలంలో జరిగిన అత్యధికంగా బీపీ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆస్పత్రి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నట్టు ఆసుపత్రి  సెమినార్‌ హాలులో  ఫిబ్రవరి 1న జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ రాజారావు, వైద్యులు వినయ్‌శేఖర్, ఆర్‌ఎంవోలు జయకృష్ణ, శేషాద్రి, సత్యరత్న ఈ వివరాలను తెలిపారు. 2018  సెప్టెంబర్‌ 24వ తేదీన గాంధీ ఆసుపత్రిలో గంట వ్యవధిలో 11,416 మందికి బ్లడ్‌ప్రెషర్‌ (బీపీ) రీడింగ్‌లు నమోదు చేశారు. 
 

దేశంలోని 37 కేంద్రాల్లో ఒకే టైమ్ లో  ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో అత్యధికంగా బీపీ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆస్పత్రి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుందని వారు వివరించారు. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ నుంచి శుక్రవారం అధికారికంగా సర్టిఫికెట్‌ అందిందని తెలిపారు.