Gandhi Jayanti 2022: నేడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ లోని సెయింట్‌ జాన్స్‌ రోటరీ-క్లాక్‌ టవర్‌ నుంచి వచ్చే వాహనాలకు చిలకలగూడ చౌరస్తాకు అనుమతి ఉండదు. ఆ వాహనాలు సంగీత్‌ క్రాస్‌రోడ్డు నుంచి ఆలుగడ్డబావి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

Gandhi Jayanti 2022: నేడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions

Gandhi Jayanti 2022: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ లోని సెయింట్‌ జాన్స్‌ రోటరీ-క్లాక్‌ టవర్‌ నుంచి వచ్చే వాహనాలకు చిలకలగూడ చౌరస్తాకు అనుమతి ఉండదు. ఆ వాహనాలు సంగీత్‌ క్రాస్‌రోడ్డు నుంచి ఆలుగడ్డబావి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

అలాగే, ఆలుగడ్డ బావి నుంచి ముషీరాబాద్‌ వెళ్లే మార్గంలోకి వాహనాలు వెళ్లకూడదు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలు చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి సీతాఫల్‌ మండి, వారాసి గూడ, విద్యానగర్ మీదుగా వెళ్లాలి. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచి సికింద్రాబాద్‌ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదు. మరోవైపు, సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఎదుట గాంధీజీ విగ్రహావిష్కరణ, సభలకు వచ్చే నాలుగు చక్రాల వాహనాలు బోయిగూడ వై జంక్షన్‌, పారామౌంట్‌ అపార్ట్‌మెంట్ పక్కన ఉండే గ్రేవియార్డ్‌ రోడ్డులో పార్కింగ్ చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు వాటర్‌బోర్డు ఆఫీస్‌ వద్ద పార్కింగ్ చేసుకునేందుకు అనుమతి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..