పూల్ థ్రిల్ : టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 03:16 AM IST
పూల్ థ్రిల్ : టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్

టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుని..ఎంచక్కా ఎంజాయ్ చేయాలని ఉంది..కానీ ఏం చేస్తాం..నిబంధనలు అడ్డు వస్తున్నాయి. అనుకుంటున్న వారికి సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తోంది. పై అంతస్తులో అత్యాధునికంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవచ్చని..పేర్కొంది. ఇప్పటి వరకు భూమిపై టాట్ లాట్ ఏరియాను మినహాయించి మిగతా ప్రాంతంలో పూల్ నిర్మాణానికి అనుమతి ఉంది. కొత్త నిబంధనల మేరకు యజమానులు తమింటి పై అంతస్తులో స్వమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు. అయితే..స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఫైర్ సేఫ్టీ ఏర్పాటు మాత్రం పక్కాగా ఉండాల్సి ఉంటుంది.

రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిబంధనల మేరకు భవనం ఎత్తు 50-55 మీటర్లు..మూడు వైపులా 16 మీటర్ల సెట్ బ్యాక్ వదలాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎత్తులో నిర్మిస్తే ప్రతి 5 మీటర్లకు ఎత్తుకు అదనంగా 0.5 మీటర్ సెట్ బ్యాక్ వదలాలి. కానీ నూతన నిబంధనల మేరకు 17 మీటర్లు వదిలితే సరిపోతుంది. భవనం మూడు వైపులా సెట్ బ్యాక్‌లో అరమీటర్ కలిసొస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం 70 – 120 మీరట్ల ఎత్తులో భవనం నిర్మిస్తే 18 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలి. దీనివల్ల నగరంలో ఎత్తైన భవనాలు నిర్మించుకొనే ఛాన్స్ ఉంది. 

2018 – 19 ఆర్థిక సంవత్సరంలో GHMC17 17.838 వ్యక్తిగత నివాస భవనాలకు అనుమతిలిచ్చింది. 2 వేల 328 రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్స్‌కు అనుమతులిచ్చింది. మరోవైపు రోడ్ల విస్తరణలో స్థలం కొల్పోయే వారికి తొలుత ఎంత బిల్డప్ ఏరియా అవకాశం ఉంటుందో రోడ్ల విస్తరణకు స్థలం ఇచ్చిన తర్వాత మిగతా స్థలంలోనూ అంత బిల్డప్ ఏరియా మేరకు భవనాన్ని తమకు నచ్చిన విధంగా కట్టుకొనే ఛాన్స్ కల్పించారు.