హరితహారం మొక్కల్ని తినేసిన మేకలు: యజమానికి ఫైన్ 

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 08:08 AM IST
హరితహారం మొక్కల్ని తినేసిన మేకలు: యజమానికి ఫైన్ 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సం కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా  నర్సరీలను ఏర్పాటు చేసి పలు జాతుల మొక్కల్ని పెంచుతున్నారు. కోట్లాది మొక్కల్ని పెంచుతూ పలువురికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే హరితహారం కోసం నర్సరీల్లో మొక్కల్ని మేకలు తినేశాయి. దీంతో సదరు మేకల యజమానికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలోని చిలుకూరులో జరిగింది. 

హరితహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఈ క్రమంలో  చిలుకూరు దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీలోకి మేకలు ప్రవేశించి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు పచ్చగా నిగనిగలాడుతున్న మొక్కల్ని మేకలు మేసేశాయి. అక్కడున్న మొక్కలన్నింటినీ  తినేశాయి. దీంతో మేకల యజమానికి చిలుకూరు పంచాయతీ కార్యదర్శి రూ. 500 జరిమానా విధించి వసూలు చేశారు పంచాయతీ కార్యదర్శి.