Gold price: దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?

దేశంలో పది గ్రాముల బంగారం ధర రూ.51,940కి చేరింది. వెండి కిలో ధర రూ.57,648కి చేరింది. మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Gold price: దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?

Gold price: దేశంలో బంగారం ధరలు పెరిగాయి. సోమవారం దాదాపు 0.13 శాతం పెరిగి, 10 గ్రాములు బంగారం ధర రూ.51,940కి చేరింది. వెండి కూడా 0.5 శాతం పెరిగి కేజీ ధర రూ.57,648కి చేరింది. దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరిగితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం తగ్గింది. ఒక ఔన్సుకు 0.1 శాతం తగ్గి 1,772 డాలర్లకు చేరింది.

Divya Kakran: ఢిల్లీ నుంచి ఏ సాయం అందట్లేదన్న క్రీడాకారిణి.. ప్రభుత్వ సమాధానమిదే

అమెరికా మార్కెట్లో 1,790 డాలర్లకు చేరింది. అమెరికాలో గత నెలలో కొత్తగా 5,28,000 ఉద్యోగాల కల్పన జరిగింది. దీంతో ఐదు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగిత రేటు తగ్గింది. అమెరికాలో 3.5 శాతం మాత్రమే నిరుద్యోగ రేటు నమోదైంది. అలాగే అమెరికన్ ఫెడరల్ మార్కెట్ 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలు అక్కడి మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో డాలరు విలువ పెరిగి, కరెన్సీపై ఆధారపడ్డ దేశాలకు బంగారం ధర భారంగా మారింది. ఇది బంగారం ధరలు తగ్గేందుకు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా బంగారం ర్యాలీ కొనసాగింది. అయితే, చివరకు 1,800 డాలర్లలోపే స్థిరపడింది. ప్రస్తుత ఎమ్‌సీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ అంచనా ప్రకారం అక్టోబర్ 5, 2022 నాటికి బంగారం ధర 0.58 శాతం తగ్గే ఛాన్స్ ఉంది.

Maharashtra: డాక్టర్ మార్నింగ్ వాక్‌కు వెళ్లడంతో పేషెంట్ మృతి.. వైద్యురాలిపై చర్యలు

సిల్వర్ ధర సెప్టెంబర్ 5 నాటికి 1.02 శాతం తగ్గే అవకాశం ఉంది. బంగారం పది గ్రాముల ధర రూ.51,864కు, వెండి కిలో ధర రూ.57,390కి చేరే అవకాశం ఉంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870గా ఉండగా, కేరళతోపాటు విజయవాడ, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.47,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870గా ఉంది.