ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదు : సమ్మెపై హైకోర్టులో కౌంటర్ దాఖలు

ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని, మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ పడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు.

  • Edited By: veegamteam , November 6, 2019 / 02:38 PM IST
ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదు : సమ్మెపై హైకోర్టులో కౌంటర్ దాఖలు

ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని, మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ పడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు.

ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని, మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ పడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బుధవారం (నవంబర్ 6, 2019) అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు. ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఆర్టీసీకి బకాయిలు రూ.3 వేల 6 కోట్ల ఉండగా ప్రభుత్వం 3 వేల 9 వందల 3 కోట్లు చెల్లించిందన్నారు.

మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీయే తిరిగి రూ.540 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు ఇస్తూనే ఉన్నామని, రుణం పద్దు కింద ఇచ్చిన నిధులు వాస్తవానికి విరాళమేనని చెప్పారు. రవాణా శాఖ మంత్రికి సెప్టెంబర్ 11న ఆర్థిక అంశాలు వివరించామని సునీల్ శర్మ చెప్పారు. మరిన్ని నిధులు రాబట్టాలనే ఉద్దేశంతోనే సర్కార్ నుంచి కొంత సొమ్ము రావాలని చూపించామని, ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన అమౌంట్ కంటే కూడా రూ. 867 కోట్లు ఎక్కువే వచ్చాయని తెలిపారు.

రుణం పద్దుకింద విడుదలైన నిధులు, అలాగే వడ్డీని ప్రభుత్వం ఎప్పుడూ అడగలేదని, జీహెచ్ ఎంసీ 2018-19 ఏడాదిలో ఎలాంటి బకాయి లేదని వివరించారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని బట్టే ఆర్టీసీకి సహాయం చేశామని జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకోషే కుమార్ అఫిడవిట్ లో తెలిపారు. 2014-15 లో మిగులు బడ్జెట్ ఉంటే ఆర్టీసీకి నిధులు ఇచ్చామని చెప్పారు. 2015-16 నుంచి జీహెచ్ ఎంసీ లోటు బడ్జెట్ లోనే కొనసాగుతుంది కాబట్టి చట్ట ప్రకారం ఆర్టీసీకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని లోకేష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది.