మహర్షి బాదుడుపై మంత్రి క్లారిటీ : టికెట్ల ధరలు పెంచడానికి పర్మిషన్ ఇవ్వలేదు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకి అదనపు షో లు (రోజుకు 5 షోలు) వేసుకోవడానికి, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్ల

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 04:38 AM IST
మహర్షి బాదుడుపై మంత్రి క్లారిటీ : టికెట్ల ధరలు పెంచడానికి పర్మిషన్ ఇవ్వలేదు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకి అదనపు షో లు (రోజుకు 5 షోలు) వేసుకోవడానికి, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్ల

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకి అదనపు షో లు (రోజుకు 5 షోలు) వేసుకోవడానికి, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందనే వార్తలపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

‘మహర్షి’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అసలు ఇటీవల కాలంలో సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దాఖలాలే లేవన్నారు. సినీ ప్రేక్షకులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని మంత్రి సూచించారు.

మంత్రి ప్రకటనతో అసలు నిజం బయటపడింది. ఇప్పుడు థియేటర్ యాజమాన్యలు ఏం చెబుతాయో చూడాలి. ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిందని చెబుతూ రేట్లు పెంచేసిన థియేటర్ యాజమాన్యాలు.. ఇప్పుడు ధరలు తగ్గిస్తాయో లేదో చూడాలి. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని చెబుతూ టికెట్ల ధరలు పెంచేసిన థియేటర్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

మహేష్ నటించిన మహర్షి మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి డైరెక్టర్. మహేష్ కెరీర్ లో ఇది 25వ సినిమా కావడంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. మహర్షి సినిమా  ప్రత్యేక షో లకు, సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. సినిమా థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరలూ కూడా  పెంచేశాయి.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ.110, మల్టీ ఫ్లెక్స్ లలో ఒక్కో టికెట్ పై రూ.50 పెంచాయి. ప్రసాద్ ఐమాక్స్ లో 138 రూపాయలున్న టికెట్ ధరను 200 రూపాయలకు  పెంచింది యాజమాన్యం. పెరిగిన ధరలు 2 వారాల పాటు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ అనుమతితోనే టికెట్ల ధరలను పెంచామని థియేటర్ల యజమానులు చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.