ప్రభుత్వం సాయం : మక్కా యాత్రలో గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి రూ.95లక్షలు

మక్కా యాత్రలో గాయపడ్డ ముజీబ్ కుటుంబానికి సౌదీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. రూ.95లక్షలు ఇచ్చింది. ఈ చెక్ ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ముజీబ్

  • Published By: veegamteam ,Published On : September 28, 2019 / 12:02 PM IST
ప్రభుత్వం సాయం : మక్కా యాత్రలో గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి రూ.95లక్షలు

మక్కా యాత్రలో గాయపడ్డ ముజీబ్ కుటుంబానికి సౌదీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. రూ.95లక్షలు ఇచ్చింది. ఈ చెక్ ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ముజీబ్

మక్కా యాత్రలో గాయపడ్డ ముజీబ్ కుటుంబానికి సౌదీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. రూ.95లక్షలు ఇచ్చింది. ఈ చెక్ ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ముజీబ్ కుటుంబానికి అందజేశారు. శనివారం (సెప్టెంబర్ 28,2019) ముజీబ్ కుటుంబాన్ని కలిసిన హోంమంత్రి.. చెక్ ను ఇచ్చారు. పోలీస్ రిక్రూట్ మెంట్ లో అక్రమాలపై హోంమంత్రి స్పందించారు. ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. రిక్రూట్ మెంట్ పారదర్శకంగా నిర్వహించామన్నారు. తెలంగాణలో రోహింగ్యాల సంఖ్య చాలా తక్కువ ఉందన్న హోంమంత్రి.. రోహింగ్యాలతో ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రోహింగ్యాలకు ప్రభుత్వం షెల్టర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను ఆశ్రయం ఇచ్చాననేది అవాస్తవం అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో నామినేషన్ వేసే హక్కు ఉందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హుజురాబాద్‌లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన సర్పంచ్‌లను అరెస్ట్‌ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. పోలీసు అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. శంషాబాద్ ఫాంహౌస్‌లో అత్యాచారం సంఘటనపై తనకు పూర్తి సమాచారం లేదని తెలిపారు.